GMC Nallagonda | నల్గొండ ప్రభుత్వ వైద్య కళాశాలలో 62 పోస్టుల భర్తీ.. 16న ఇంటర్వ్యూలు
GMC Nallagonda | నల్లగొండ మెడికల్ కాలేజీలో ఖాళీగా ఉన్న వివిధ బోధనా సిబ్బంది పోస్టులను కాంట్రాక్ట్ ప్రాతిపదికన భర్తీ చేసేందుకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. ఈ నెల 16వ తేదీన అర్హులైన అభ్యర్థులు ఇంటర్వ్యూలకు హాజరు కావొచ్చు.
GMC Nallagonda | మీరు ఎంబీబీఎస్, ఎంఎస్, ఎండీ పూర్తి చేశారా..? ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్, ట్యూటర్‌గా పని చేయాలనుకుంటున్నారా..? అయితే నల్లగొండ మెడికల్ కాలేజీలో పై విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు తెలంగాణ వైద్య విద్యా సంచాలకులు నోటిఫికేషన్ జారీ చేశారు. నల్లగొండ మెడికల్ కాలేజీలో ఖాళీగా ఉన్న వివిధ బోధనా సిబ్బంది పోస్టులను కాంట్రాక్ట్ ప్రాతిపదికన భర్తీ చేసేందుకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. ఈ నెల 16వ తేదీన అర్హులైన అభ్యర్థులు ఇంటర్వ్యూలకు హాజరు కావొచ్చు. అర్హతులు, పోస్టుల వివరాల వంటి విషయాలను తెలుసుకుందాం.
పోస్టుల వివరాలు:
1. ప్రొఫెసర్ – 01
2. అసోసియేట్ ప్రొఫెసర్ – 15
3. అసిస్టెంట్ ప్రొఫెసర్ – 32 (స్పెసిఫిక్ విభాగాలతో కలిపి)
4. ట్యూటర్ – 14
మొత్తం ఖాళీల సంఖ్య: 62
ఖాళీగా ఉన్న విభాగాలు
అనాటమీ, ఫిజియాలజీ, బయో కెమిస్ట్రీ, ఫార్మాకాలజీ, పాథాలజీ, మైక్రో బయాలజీ, ఫోరెన్సిక్ మెడిసిన్, కమ్యూనిటీ మెడిసిన్, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, రేడియాలజీ, ఓబెస్ట్రిక్స్, గైనకాలజీ, డెర్మటాలజీ, జనరల్ మెడిసిన్, ఆర్థోపెడిక్స్, టీబీ అండ్ చెస్ట్ డిసీజెస్, ఆప్తామాలజీ, సైకియాట్రీ, అనష్థీషియా, హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్, ట్రాన్స్‌ఫ్యూజన్ మెడిసిన్, ఎమర్జెన్సీ మెడిసిన్.
అర్హతలు
సంబంధిత విభాగంలో ఎండీ (MD)/ ఎంఎస్ (MS)/ డీఎన్‌బీ (DNB) లేదా ఎన్ఎంసీ (NMC) నిబంధనల ప్రకారం అర్హత కలిగి ఉండాలి. తెలంగాణ స్టేట్ మెడికల్ కౌన్సిల్‌లో రిజిస్ట్రేషన్ తప్పనిసరి. ఇతర రాష్ట్రాల అభ్యర్థులు ఎంపికైన వారం రోజుల్లోగా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి.
వయస్సు
దరఖాస్తుదారులు 69 ఏళ్ల లోపు వారై ఉండాలి.
వేతనం
ప్రొఫెసర్‌కు నెలకు రూ.1,90,000, అసోసియేట్ ప్రొఫెసర్‌కు రూ.1,50,000, అసిస్టెంట్ ప్రొఫెసర్‌కు రూ.1,25,000, ట్యూటర్‌కు రూ.55,000.
ఇంటర్వ్యూ వివరాలు
తేదీ: మార్చి 16, 2026.
సమయం: ఉదయం 10.00 గంటల నుంచి మధ్యాహ్నం 02.00 గంటల వరకు.
వేదిక
ప్రిన్సిపాల్ ఛాంబర్, ప్రభుత్వ వైద్య కళాశాల (GMC), నల్గొండ.
ముఖ్య గమనిక
అభ్యర్థులు ఇంటర్వ్యూ సమయంలో తమ ఒరిజినల్ సర్టిఫికేట్లను వెరిఫికేషన్ కోసం వెంట తీసుకురావాలి. ఎంపికైన వారు వారం రోజుల్లోగా విధుల్లో చేరాల్సి ఉంటుంది.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram