Chiranjeevi | అన్ని ప్లాట్‌ఫామ్స్‌లో మెగాస్టార్ సునామీ.. ‘మన శంకర వరప్రసాద్ గారు’కి టీవీలోనూ భారీ టీఆర్పీ

Chiranjeevi | టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి హీరోగా, లేడీ సూపర్ స్టార్ న‌య‌న‌తార‌ హీరోయిన్‌గా నటించిన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ మ‌న శంక‌ర వ‌ర‌ప్ర‌సాద్ గారు ఈ ఏడాది సంక్రాంతి సందర్భంగా విడుదలై భారీ విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. దర్శకుడు అనీల్ రావిపూడి తెరకెక్కించిన ఈ చిత్రం అంచనాలకు మించి సెన్సేషనల్ హిట్‌గా నిలిచి రీజనల్ ఇండస్ట్రీలో రికార్డులు సృష్టించింది.

  • By: Sandeep |    movies |    Published on : Mar 13, 2026 8:44 AM IST
Chiranjeevi | అన్ని ప్లాట్‌ఫామ్స్‌లో మెగాస్టార్ సునామీ.. ‘మన శంకర వరప్రసాద్ గారు’కి టీవీలోనూ భారీ టీఆర్పీ

Chiranjeevi | టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి హీరోగా, లేడీ సూపర్ స్టార్ న‌య‌న‌తార‌ హీరోయిన్‌గా నటించిన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ మ‌న శంక‌ర వ‌ర‌ప్ర‌సాద్ గారు ఈ ఏడాది సంక్రాంతి సందర్భంగా విడుదలై భారీ విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. దర్శకుడు అనీల్ రావిపూడి తెరకెక్కించిన ఈ చిత్రం అంచనాలకు మించి సెన్సేషనల్ హిట్‌గా నిలిచి రీజనల్ ఇండస్ట్రీలో రికార్డులు సృష్టించింది. థియేటర్లలో విడుదలైన తర్వాత ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధించింది. ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ.400 కోట్లకు చేరువలో గ్రాస్ కలెక్షన్లు రాబట్టి ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరిచింది. మెగాస్టార్ కెరీర్‌లో మరో భారీ విజయంగా నిలిచిన ఈ సినిమా ఫ్యామిలీ ఆడియన్స్‌ను ప్రత్యేకంగా ఆకట్టుకుంది.

అదే జోరు..

థియేటర్లలో సంచలన విజయం సాధించిన తర్వాత ఈ చిత్రం ఓటీటీ ప్లాట్‌ఫారమ్ ZEE5లో విడుదలై అక్కడ కూడా రికార్డు స్థాయి స్పందనను అందుకుంది. డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లో భారీ వ్యూస్ సాధించి మరోసారి ఈ సినిమాకు ఉన్న క్రేజ్‌ను నిరూపించింది. ఇక తాజాగా బుల్లితెరపై ప్రసారమైనప్పటికీ అదే జోరు కొనసాగింది. జీ తెలుగులో జరిగిన మొదటి టెలికాస్ట్‌కు ఏకంగా 14.2 టీఆర్పీ రేటింగ్ నమోదు కావడం విశేషం. ఇటీవల కాలంలో స్టార్ హీరోల సినిమాలకు కూడా ఇలాంటి భారీ టీఆర్పీ రావడం అరుదే. దీంతో మెగాస్టార్ క్రేజ్ అన్ని ప్లాట్‌ఫారమ్‌లలోనూ కొనసాగుతుందనే విషయం మరోసారి రుజువైంది.

కామెడీ, ఎమోషన్, మాస్ ఎలిమెంట్స్ అన్నీ సమతుల్యంగా మిళితం చేసిన ఈ సినిమా ప్రేక్షకులను అన్ని వర్గాల వారినీ ఆకట్టుకుంది. ముఖ్యంగా దర్శకుడు అనిల్ రావిపూడి తన మార్క్ కామెడీతో సినిమాను పూర్తి స్థాయి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా మలచడం విజయంలో కీలక పాత్ర పోషించింది. ఈ చిత్రంలో ప్రముఖ హీరో వెంక‌టేష్ ద‌గ్గుబాటి గెస్ట్ రోల్‌లో కనిపించడం కూడా అభిమానులకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. సంగీత దర్శకుడు భీమ్స్ సిసిరోలియా అందించిన సంగీతం కూడా సినిమాకు మంచి ప్లస్ అయింది.

ఇక ఈ భారీ చిత్రాన్ని సుస్మిత కొణిదెల‌తో పాటు నిర్మాత సాహు గార్ల‌పాటి నిర్మించారు. మొత్తంగా థియేటర్లు, ఓటీటీ, టెలివిజన్… ఇలా మూడు ప్లాట్‌ఫారమ్‌లలోనూ ‘మన శంకర వరప్రసాద్ గారు’ సంచలన విజయాన్ని నమోదు చేసి మెగాస్టార్ మ్యాజిక్ ఇప్పటికీ తగ్గలేదని మరోసారి నిరూపించింది.