విధాత, హైదరాబాద్ : పశ్చిమాసియా యుద్ద పరిస్థితులు అంతర్జాతీయంగా స్టాక్ మార్కెట్లను, బులియన్ మార్కెట్ ని కుదిపేస్తున్నాయి. క్రూడాయిల్ ధరల పెరుగుదల, డాలర్ పుంజుకోవడంతో వంటి పరిణామాల మధ్య బంగారం, వెండి ధరలు పతనమవుతున్నాయి.
శనివారం బులియన్ మార్కెట్ లో 24క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ. 1030 తగ్గి రూ. 1,59,660 కి పడిపోయింది. 22క్యారెట్ల బంగారం 10గ్రాముల బంగారం ధర రూ. 950తగ్గి రూ. 1,46,350వద్ద నిలిచింది. వెండి ధర సైతం మరోసారి పతనమైంది. కిలో వెండి ధర రూ. 10,000 తగ్గి రూ. 2,80,000వద్ద కొనసాగుతుంది.
వేచి చూస్తారా..కొంటారా..?
పశ్చిమాసియా యుద్ద పరిస్థితులతో దిగి వస్తున్న బంగారం, వెండి ధరలు కొనుగోలుదారులను ఊరిస్తున్నాయి. అయితే ప్రస్తుత తగ్గుదల తాత్కాలికమేనంటున్నా మార్కెట్ నిపుణులు. చమురు ధరల పెరుగుదల, ఎగుమతుల సంక్షోభం, డాలర్ బలపడటం, పెట్టుబడుల మళ్లింపుపై వేచి చూసే ధోరణితో బంగారం, వెండి ధరలు తగ్గుదలను నమోదు చేస్తున్నాయి.
అయితే కాస్తా యుద్ద ఉద్రిక్తతలు తగ్గి..ఎగుమతుల ఆటంకాలు తొలగిపోయినట్లయితే మళ్లీ బంగారం, వెండి ధరలు పరుగు అందుకుంటాయని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో బంగారం, కొనుగోలుదారులు మరికొన్ని రోజులు వేయి చూస్తారా ? లేక శుభకార్యాలు ఉన్నవారు ఇప్పుడే కొనుగోలు చేస్తారా ? అన్నదానిపై ఆచితూచి అడుగులేయాలని నిపుణులు చెబుతున్నారు.
ఇవి కూడా చదవండి :
CM Revanth Reddy | ప్రభుత్వం రియల్ ఎస్టేట్ చేస్తే తప్పేంటి? : సీఎం రేవంత్ రెడ్డి
Hyderabad | హైదరాబాద్ నగరంలో మరో భారీ అగ్నిప్రమాదం..
