• Telugu News
  • /National

అమెరికా వెళ్లేవారికి గుడ్ న్యూస్..భారీగా హెచ్ H-1B, H-4 వీసా స్లాట్లు

అమెరికా వెళ్లాలనుకునే వారికి ఊరట. భారతీయ కాన్సులేట్లలో భారీగా H-1B, H-4 వీసా స్లాట్లు విడుదలయ్యాయి. ముంబై, చెన్నై కేంద్రాల్లో బుకింగ్‌కు పోటీ నెలకొంది.

Reported by: Tejaswini Nanna | జాతీయం | Jun 16, 2026, 2:05 pm IST
Read Time: 3 mins
అమెరికా వెళ్లేవారికి గుడ్ న్యూస్..భారీగా హెచ్ H-1B, H-4 వీసా స్లాట్లు

అమెరికా వెళ్లాలనుకునే గుడ్ న్యూస్ వచ్చింది. మంగళవారం ఉదయం భారతీయ కాన్సులేట్లలో H-1B, H-4 వీసా స్లాట్లు భారీగా అందుబాటులోకి రావడంతో వాటి కోసం నిరీక్షిస్తున్న భారతీయులకు గొప్ప ఊరట దక్కింది. భారత కాలమానం ప్రకారం ఉదయం 8:00 గంటల నుండి 10:00 గంటల మధ్య వీసా స్లాట్లు ఓపెన్ అయ్యాయి. దీంతో ముంబై, చెన్నైలలో అపాయింట్‌మెంట్ డేట్స్ బుక్ చేసుకోవడానికి దరఖాస్తుదారులు పోటీ పడ్డారు. అమెరికా వర్క్ వీసా కోసం ఎదురుచూస్తున్న వారికి ఇది మంచి అవకాశంగా చెబుతున్నారు.

ప్రస్తుతం అందుబాటులోకి వచ్చిన స్లాట్లు ఎక్కువగా 2026 చివరి నెలలు లేదా 2027 ప్రారంభానికి సంబంధించినవి. హైదరాబాద్, న్యూఢిల్లీలలో కూడా ఇన్-పర్సన్ ఇంటర్వ్యూల కోసం కొద్దిసేపు స్లాట్లు కనిపించాయి. అయితే, నేరుగా ఇంటర్వ్యూకి వెళ్లే వారితో పోలిస్తే ఇంటర్వ్యూ వెయివర్ (డ్రాప్‌బాక్స్) స్లాట్లు చాలా తక్కువగా ఉన్నాయి. అభ్యర్థులు ఈరోజు సాయంత్రం మరోసారి పోర్టల్‌ను చెక్ చేసుకోవడం మంచిదని సూచిస్తున్నారు. తక్షణ ప్రయాణ ప్రణాళికలు ఉన్నవారు ఈ విండోలను ఎప్పటికప్పుడు ట్రాక్ చేయాలని సూచించారు. వచ్చే వారం కూడా చిన్న చిన్న విడతల్లో స్లాట్లు విడుదలయ్యే అవకాశం ఉందని, బుకింగ్‌కు ప్రయత్నించే ముందే మీ పేమెంట్ రిసీట్స్ వ్యాలిడిటీని తనిఖీ చేసుకోండని చెబుతున్నారు. సాంకేతిక లోపాలు తలెత్తకుండా పిటిషన్ వివరాలన్నీ సరిచూసుకోవాని, స్కిల్డ్ వర్కర్ల కోసం డ్రాప్‌బాక్స్ అర్హత పొడిగింపుపై వచ్చే అధికారిక ప్రకటనల కోసం వేచి చూడాలని, స్లాట్లు దక్కించుకోవడానికి పోర్టల్‌ను నిరంతరం గమనిస్తూ ఉండటమే ఏకైక మార్గం అని, ప్రక్రియ సాఫీగా సాగాలంటే మీ డాక్యుమెంట్లను ముందే సిద్ధం చేసుకోవాలని సూచిస్తున్నారు.