• Telugu News
  • /National

తమిళనాడులో రైతు రుణమాఫీ: సీఎం విజయ్‌ నిర్ణయం

తమిళనాడులో రైతులకు భారీ ఊరట. రూ.75 వేల వరకు సహకార రుణాలను మాఫీ చేస్తున్నట్లు సీఎం విజయ్ ప్రకటించారు. 14.43 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూరనుంది.

Reported by: Tejaswini Nanna | జాతీయం | Jun 16, 2026, 3:16 pm IST
Read Time: 3 mins
తమిళనాడులో రైతు రుణమాఫీ: సీఎం విజయ్‌ నిర్ణయం

తమిళనాడు సీఎం విజయ్ రైతుల సహకార రుణాల మాఫీ పథకాన్ని అమలు చేయనున్నట్లగా ప్రకటించారు. రూ.75,000 వరకు ఉన్న రైతు రుణాలను ప్రభుత్వం మాఫీ చేస్తుందని సీఎం విజయ్ వెల్లడించారు. రుణామాఫీతో రాష్ట్ర వ్యాప్తంగా 14.43 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూరనుందని తెలిపారు. తద్వారా ప్రభుత్వంపై రూ.5,932 కోట్ల మేర అదనపు భారం పడనుందని వెల్లడించారు. ఇటీవల మహిళలు, పిల్లల భద్రతకు షీ టీమ్స్ తరహాలో తమిళననాడు రాష్ట్రంలో ‘సింగప్పెన్‌ స్పెషల్ టాస్క్ ఫోర్స్’ అనే ప్రత్యేక మహిళా పోలీస్‌ విభాగాన్ని సీఎం విజయ్ ప్రభుత్వం ప్రారంభించిన సంగతి తెలిసిందే.

రైతు రుణమాఫీ పథకం వివరాలు

ఈ పథకం నిబంధనల ప్రకారం సహాకార సంస్థల్లో లోన్‌ తీసుకున్న చిన్న, సన్నకారు రైతులకు రూ.75,000ల పరిమితి వరకు 100 శాతం రుణమాఫీ లభిస్తుంది. ఒకవేళ తీసుకున్న రుణం మొత్తం రూ.75,000 కంటే ఎక్కువగా ఉంటే, వారికి గరిష్టంగా రూ.35,000ల వరకు రుణమాఫీ వర్తింపజేస్తారు. దీని ద్వారా గత ఏడాది కాలంలో పంట రుణాలు తీసుకున్న వారందరికీ కనీసం రూ.35,000 నుండి గరిష్టంగా రూ.75,000ల వరకు పరోక్ష సహాయం చేకూరనుంది.

మరోవైపు కేరళంలో కొత్తగా అధికారంలోకి వచ్చిన సీఎం సతీశన్ యూడీఎఫ్ ప్రభుత్వం రాష్ట్రంలో ప్రియదర్శిని పేరుతో ఉచిత బస్ పాస్ పథకాన్ని ప్రారంభించడం విశేషం. అటు కొత్తగా అధికారం చేపట్టిన పశ్చిమ బెంగాల్, అస్సాం, పాండిచ్చేరి సీఎంలు సైతం తమ ఎన్నికల హామీలను ఒక్కోటిగా అమలు చేస్తుండటం ఆసక్తికరం.