విధాత, హైదరాబాద్ : హిందూ ధర్మాన్ని, వేదాలను, బ్రహ్మణులను కించపరిచేలా వ్యాఖ్యలు చేశారంటూ తుంగతుర్తి కాంగ్రెస్ ఎమ్మెల్యే మందుల సామేల్ ఇంటిని బీజేవైఎం కార్యకర్తలు ముట్టడించి కోడిగుడ్లతో దాడి చేశారు. బోడుప్పల్ లోని ఆయన నివాసంపై బీజేవైఎం కార్యకర్తులు కోడిగుడ్లతో దాడి చేసి నిరసన తెలిపారు.
ఎన్నికల సమయంలో దేవాలయాల్లో పొర్లు దండాలు పెట్టి, ఇప్పుడు హిందూ సమాజాన్ని అవమానించడం తగదని విమర్శించారు. మందుల సామేల్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. 24 గంటల్లోగా సామేల్ బహిరంగ క్షమాపణ చెప్పాలని, లేనిపక్షంలో ఆందోళనలు ఉదృతం చేస్తామని హెచ్చరించారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని ఆందోళనకారులను అదుపులోకి తీసుకుని సమీప పోలీస్ స్టేషన్లకు తరలించారు.
ఎమ్మెల్యే మందుల సామేల్ ఇంటిపై కోడిగుడ్లతో దాడి..
హిందూ ధర్మాన్ని కించపరిచేలా వ్యాఖ్యలు చేశారంటూ తుంగతుర్తి కాంగ్రెస్ ఎమ్మెల్యే మందుల సామేల్ ఇంటిని ముట్టడించిన బీజేవైఎం @BJYM నాయకులు.. బోడుప్పల్ లోని ఆయన నివాసంపై కోడిగుడ్లతో దాడి చేసి, తీవ్ర నిరసన తెలిపారు.
ఎన్నికల సమయంలో… pic.twitter.com/aXwhFgWfwW
— Telugu Reporter (@TeluguReporter_) March 16, 2026
ఇవి కూడా చదవండి :
Neuroscience | ఫ్రీజ్ చేసిన మెదడుకు మళ్లీ జీవం పోసిన శాస్త్రవేత్తలు.. క్రయోప్రిజర్వేషన్‌లో విప్లవాత్మక ముందడుగు
Tadoba Tiger : పెద్దపులితో ఇలాగేనా?…దాడి చేస్తే అంతే !
