Tadoba Tiger : పెద్దపులితో ఇలాగేనా?…దాడి చేస్తే అంతే !
తడోబా సమీపంలో రోడ్డు దాటుతున్న పెద్దపులిని చూసి వాహనదారులు హడావుడి చేయడంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. అయినా పులి సహనం కోల్పోకుండా అడవిలోకి వెళ్లిపోయిన ఘటన వీడియోగా వైరల్ అవుతోంది.
విధాత : పెద్దపులి క్రూర మృగం..సహజంగా మనుషుల జోలికి రాదు. సహనం కోల్పోయి మ్యానిటర్ గా మారితే మాత్రం వరసపెట్టి మనుషులను చంపుతుండటం చూస్తుంటాం. ఓ పెద్దపులి తాజాగా అభయారణ్యంలో రోడ్డు దాటుతున్న క్రమంలో మనుషులు చేసిన న్యూసెన్స్… ఆ సందర్బంలో పెద్దపులి వహించిన సహనం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
తడోబా సమీపంలోని మొహుర్లి-చంద్రపూర్ రహదారిని దాటడానికి ఓ పెద్ద పులి పులి ప్రయత్నించింది. అదే సమయంలో ఆ మార్గంలో వెలుతున్న వాహనదారులు పెద్దపులి సమీపంలోకి చేరుకుని వాహనాల శబ్దంతో పాటు సెల్ ఫోన్లలో దానిని వీడియోలు, ఫోటోలు తీయడానికి హడావుడి చేశారు. దీంతో పెద్ద పులి చుట్టు తీవ్ర గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. అయితే ఆ పులి మాత్రం తనను ఇబ్బంది పెట్టేలా వ్యవహరించిన వారిని ఏమి అనకుండా ఒడుపుగా రోడ్డు దాటి సమీప అడవుల్లోకి వెళ్లిపోయింది.
ఆ సమయంలో పులి వెనుకాలే అనుసరిస్తు మరి కొందరు ఫోటోలు, వీడియోలు తీసే ప్రయత్నం చేయడంతో పులి కొంత హడలిపోయింది. వారి హంగామాను పెద్దపులి తప్పుగా అర్దం చేసుకుని తనపై దాడి చేస్తున్నారనుకుని దాడికి దిగితే మాత్రం వారికి ప్రాణాపాయం తప్పేది కాదు. ఈ ఘటనలో పులి కంటే కూడా అటుగా వెళ్తున్న ప్రయాణికులే ఆ వన్యప్రాణిని చికాకు పెట్టేలా తమ మానవ నైజం ప్రదర్శించారంటూ పర్యావరణ ప్రేమికులు చురకలేస్తున్నారు.
Chaos reigns supreme after a #tiger attempts to cross the #Mohurli– #Chandrapur road near #Tadoba. More than the #tiger, passersby turned wild showcasing their true behavior. @LokmatTimes_ngp @etadoba @MahaForest @ntca_india @moefcc @mytadoba @lokmat pic.twitter.com/jfZQ4bRHrx
— Vijay Pinjarkar (@vijayp091) March 16, 2026
ఇవి కూడా చదవండి :
Moinabad Farmhouse Drugs Case | డ్రగ్స్ కేసులో పైలట్ రోహిత్‌రెడ్డి సహా ముగ్గురికి రిమాండ్
Oscar Awards 2026 | 98వ ఆస్కార్ అవార్డులు .. ఉత్తమ నటుడిగా మైఖేల్ బి జోర్డన్, ఉత్తమ నటి జెస్సీ బుక్లే
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram