కాంగ్రెస్ భవిష్యత్తుపై మాజీ మంత్రి మల్లారెడ్డి కీలక వ్యాఖ్యలు

మాజీ మంత్రి మల్లారెడ్డి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తుపై సెటైర్లు వేశారు. పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్‌ను కేవలం పెళ్లి స్వర్ణోత్సవానికి ఆహ్వానించేందుకే కలిశానని స్పష్టం చేశారు.

Malla Reddy

విధాత, హైదరాబాద్ : మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తుపై తనదైన శైలిలో కీలక వ్యాఖ్యలు చేశారు. మల్లారెడ్డి తన వివాహా స్వర్ణోత్సవానికి పీసీసీ చీఫ్ బి.మహేశ్ కుమార్ గౌడ్, మంత్రులను కలిసి ఆహ్వాన పత్రిక అందించి ఆహ్వానించారు. ఈ సందర్బంగా తనను కలిసిన మీడియా ప్రతినిధులతో మల్లారెడ్డి చిట్ చాట్ లో మాట్లాడారు.

నా 50వ పెళ్లీ వేడుకకు ఆహ్వానించేందుకు మాత్రమే పీసీసీ చీఫ్ ను, మంత్రులను కలిశానని, కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు కాదని స్పష్టం చేశారు. మునిగిపోయే పడవల ఎవరైనా చేరుతారా అంటూ సెటైర్లు వేశారు. గ్రౌండ్ లో ఎవరు బలంగా ఉన్నారో అందరికీ తెలుసు అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే బోయిన్‌ప‌ల్లి తన 50వ పెళ్లి వార్షికోత్సవం సంబరాలను ప్రారంభించిన మల్లారెడ్డి సతీమణితో కలిసి వేదికలపై సినిమా పాటలకు డ్యాన్సులతో అదరగొడుతున్నారు.

70 ఏళ్ల వ‌య‌స్సులో కూడా త‌న‌దైన స్టైల్లో మ‌ల్లారెడ్డి డ్యాన్స్ చేసిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. మరోవైపు మల్లారెడ్డి కోడలు ప్రితిరెడ్డి కూడా శాస్త్రీ నృత్యంతో పాటు, సినిమా పాటలు, ఫోక్ సాంగ్స్ లకు చేసిన డ్యాన్స్ లో ఆకట్టుకుంది. మామ మల్లారెడ్డి, కోడలు ప్రితిరెడ్డిల డ్యాన్స్ వీడియోలు సోషల్ మీడియాలో సందడి చేస్తుండటం విశేషం.

ఇవి కూడా చదవండి :

బీఆర్ఎస్ నినాదాల మధ్య కొనసాగుతున్న గవర్నర్ ప్రసంగం
Telangana Thalli | ఇటు తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ..అటు పొట్టి శ్రీరాములు విగ్రహావిష్కరణ

Latest News