• Telugu News
  • /Hyderabad

బీఆర్ఎస్ నినాదాల మధ్య కొనసాగుతున్న గవర్నర్ ప్రసంగం

తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా ప్రసంగం మధ్య బీఆర్ఎస్ సభ్యుల నినాదాలు కొనసాగాయి. తెలంగాణను 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.

Reported by: Tejaswini Nanna | హైదరాబాద్​ | Mar 16, 2026, 12:43 pm IST
Read Time: 3 mins
బీఆర్ఎస్ నినాదాల మధ్య కొనసాగుతున్న గవర్నర్ ప్రసంగం

విధాత, హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగిస్తున్నారు. ఆయన తెలుగులో తన ప్రసంగాన్ని ప్రారంభించడం విశేషం. ప్రభుత్వ ప్రాధాన్యతలు, లక్ష్యాలను వివరిస్తూ గవర్నర్ ప్రసంగం కొనసాగుతుండగా..ప్రతిపక్ష బీఆర్ఎస్ సభ్యులు పలుమార్లు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలతో ఆటంకం కల్పించారు. విదేశీ పెట్టుబడులపై అబద్దాలు చెబుతున్నారని నినాదాలు చేశారు. బీఆర్ఎస్ సభ్యుల నినాదాల మధ్యనే గవర్నర్ తన ప్రసంగాన్ని కొనసాగించారు.

ప్రజా సంక్షేమమే లక్ష్యంగా మా ప్రభుత్వ పాలన కొనసాగుతుందని గవర్నర్ ఎస్పీ శుక్లా తెలిపారు. 2047 తెలంగాణ రైజింగ్ దిశగా అడుగులు వేస్తున్నామని, ప్రపంచానికి దిక్సూచిగా తెలంగాణ మారుతుందని గవర్నర్ తెలిపారు. 2047 నాటికి తెలంగాణ 3 ట్రిలియన్ డాలర్ల ఎకనామిగా మారుతుందని అన్నారు. ప్రతి పౌరుడు అభివృద్ధిలో భాగస్వామిగా ఉండేలా బడ్జెట్‌ ఉండనుందని తెలిపారు. ప్రతి వర్గానికి అభివృద్ధి ఫలాలు అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు.

గ్లోబల్ సమ్మిట్ ద్వారా 5 లక్షల 72వేల కోట్ల విదేశీ పెట్టుబడుల సమీకరణ జరిగిందని, ఓఆర్ఆర్, త్రిబుల్ ఆర్ కు అనుసంధానంగా రేడియల్ రోడ్లు నిర్మిస్తున్నామని, ఫ్యూచర్ సిటీ నుంచి బందర్ పోర్టు వరకు గ్రీన్ ఎక్స్ ప్రెస్ హైవే నిర్మించబోతున్నామని తెలిపారు. బుల్లెట్ ట్రైన్స్ కు శంషాబాద్ కేంద్రంగా మారబోతుందన్నారు.

ఇవి కూడా చదవండి :

Telangana Thalli | ఇటు తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ..అటు పొట్టి శ్రీరాములు విగ్రహావిష్కరణ
Vijayasai Reddy Farm | రైతుగా మారిన వైసీపీ మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి