ఆయనకే ఫ్యూచర్ లేదు…ఫ్యూచర్ సిటీని ఏం ఆపుతారు: హరీష్ రావుపై మంత్రి పొంగులేటి ఫైర్
ఫ్యూచర్ సిటీని ఆపుతామన్న హరీష్ రావుపై మంత్రి పొంగులేటి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్‌కు ఫ్యూచర్ లేదని, కాంగ్రెస్ ప్రభుత్వం దేశం గర్వించే ఫ్యూచర్ సిటీ నిర్మిస్తుందని అన్నారు.
మాజీ మంత్రి టి.హరీష్ రావుకే బీఆర్ఎస్ లో ఫ్యూచర్ ఏంటో తెలియడం లేదని..అలాంటి ఆయన ఫ్యూచర్ సిటీని ఆపుతాననడం హాస్యాస్పదం అని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మండిపడ్డారు. అమెరికాలో ఉండి ఫ్యూచర్ సిటీని ఆపేస్తాం అంటూ ప్రకటించిన హరీష్ రావు .. ఫ్యూచర్ సిటీ భూములను తాకట్టు పెట్టడానికి అమెరికాలో ఎవరితోనైనా ఒప్పందం చేసుకున్నారా..? అని పొంగులేటి కీలక ప్రశ్నలు సంధించారు.
పదేండ్లలో హైదరాబాద్ లో కనీసం ఒక్క మెట్రో స్టేషన్ కూడా కట్టని మీకు.. కాంగ్రెస్ ప్రభుత్వం ఏకంగా ఒక నగరమే నిర్మిస్తున్నది అంటే అసూయ కలగక తప్పదు. కేసీఆర్ కుటుంబ సభ్యుల కోసం ఎక్కడ పడితే అక్కడ ఫాంహౌస్ లు కట్టుకున్నారు. కానీ మేము రాష్ట్రం కోసం, దేశం కోసం ఫ్యూచర్ సిటీ కడుతుంటే, ఆపుతాం అంటున్నారు అని పొంగులేటి మండిపడ్డారు.
మూసీని బాగుచేస్తామంటే అడ్డుపడుతున్నారు, లగచర్లలో ఇండస్ట్రీస్ పెట్టి యువతకు ఉద్యోగాలిస్తామంటే కుట్రచేసారు, ఇప్పుడు ఫ్యూచర్ సిటీని ఆపుతాం అంటున్నారని బీఆర్ఎస్ పై విమర్శలు చేశారు. అధికారంలోకి వస్తామంటూ హరీష్ రావు పగటి కలలు కంటున్నారని, ప్రజల ఆశీస్సులతో వచ్చే ఎన్నికల్లోనూ కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది అన్నారు. దేశం గర్వించే విధంగా ఫ్యూచర్ సిటీని నిర్మిస్తుందని పొంగులేటి స్పష్టం చేశారు. మీ పొలిటికల్ ఫ్యూచర్ ఖతం చెయ్యాలి అని మీ మామా మీ బామ్మర్ది చూస్తున్నారు.. ఫ్యూచర్ లేని బీఆర్ఎస్ పార్టీ నుండి పోయి మీ ఫ్యూచర్ కాపాడుకో అని హరీష్ రావుకు పొంగులేటి సూచించారు. చివరగా ఒక్కటి మాత్రం చెప్పదల్చుకున్నానని.. బీఆర్ఎస్‌కు ఫ్యూచర్ లేదు.. ఫ్యూచర్ సిటీకి తిరుగులేదు అని పొంగులేటి ఉద్ఘాటించారు.
ఇవి కూడా చదవండి :
పక్కా స్కెచ్ తో.. కారుతో ఢీ కొట్టి న్యాయవాదిపై హత్యా యత్నం
హైదరాబాద్ లో టెస్లా ఇవి కార్ల షోరూం…
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram