SBI Credit Cards | క్రెడిట్‌ కార్డు యూజర్లకు షాక్‌ ఇచ్చిన ఎస్‌బీఐ..! ఆ కార్డుల రివార్డు పాయింట్లలో కోత..!

  • Publish Date - March 18, 2024 / 04:59 AM IST

SBI Credit Cards | క్రెడిట్‌కార్డు యూజర్లకు ఎస్‌బీఐ షాక్‌ ఇచ్చింది. ఎంపిక చేసిన క్రెడిట్‌కార్డులతో రెంట్‌ ట్రాన్సాక్షన్లకు రివార్డ్‌ పాయింట్లు ఉండవని స్పష్టం చేసింది. రివార్డ్‌ పాయింట్ల సేకరణ సర్వీసెస్‌ను పలు కార్డులకు నిలిపివేస్తున్నట్లు పేర్కొంది. ఈ మార్పులు వచ్చే ఆర్థిక సంవత్సరం 2024 ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వస్తుందని స్పష్టం ఎస్‌బీఐ పేర్కొంది. సదరు రివార్డ్ పాయింట్ల వినియోగం సైతం ఈ ఏడాది ఏప్రిల్‌ 15న ముగియనున్నట్లు చెప్పింది. ఎస్‌బీఐ ఆరమ్, ఎస్‌బీఐ ఎలైట్ఎలైట్ అడ్వాంటేజ్, పల్స్, సింప్లీక్లిక్, సింప్లీక్లిక్ అడ్వాంటేజ్, ఎస్‌బీఐ ప్రైమ్‌, ప్రైమ్ అడ్వాంటేజ్, ప్లాటినం, ప్రైమ్ ప్రో, శౌర్య సెలక్ట్, ప్లాటినమ్ అడ్వాంటేజ్, డాక్టర్స్ ఎస్‌బీఐ, గోల్డ్ ఎస్‌బీఐ కార్డ్, గోల్డ్ క్లాసిక్, గోల్డ్ క్లాసిక్, గోల్డ్ డిఫెన్స్ ఎస్‌బీఐ కార్డ్‌ తదిత కార్డులున్నాయి.

ఎయిర్‌ ఇండియా ప్లాటినమ్ కార్డ్, ఎయిర్‌ ఇండియా సిగ్నేచర్ కార్డ్, ఆదిత్యా బిర్లా సెలక్ట్, బీపీసీఎల్ ఆక్టేన్, క్లబ్ విస్తారా, ఐఆర్‌సీటీసీ ప్రీమియర్, సెంట్రల్ ఎస్‌బీఐ తదితర కార్డులకు ఇక ఏప్రిల్ 15 నుంచి వర్తించని చెప్పింది. ప్రస్తుతం ఉన్న రివార్డు పాయింట్లు రిడిమ్‌ చేసుకునేందుకు అవకాశం ఉంది. మొదట sbicard.com వెబ్‌సైట్‌కు వెళ్లి రివార్డ్‌ రీడిమ్స్‌పై క్లిక్‌ చేయాలి. కేటలాగ్‌ ద్వారా బ్రౌజ్ చేసి మీ ఐటమ్ ఛాయిస్ ఎంపిక చేసుకోవాలి. ఆ తర్వాత రిడీమ్ నౌ ‌పై క్లిక్ చేసి కన్ఫర్మ్ చేయాలి. అదే సమయంలో ఎస్‌బీఐ కార్డుకు సంబంధించి ఇంట్రెస్ట్ కాలిక్యులేషన్, మినిమం డ్యూ అమౌంట్ కాలిక్యులేషన్‌లో మార్పులు చేస్తూ నిర్ణయం తీసుకున్నది. మార్చి 15 నుంచే అమల్లోకి రాగా.. మరోవైపు అంతకుముందే పేటీఎం ఎస్‌బీఐ క్రెడిట్ కార్డులో రెంట్ పేమెంట్ ట్రాన్సాక్షన్లపై క్యాష్‌బ్యాక్‌ను ఎత్తివేసిన విషయం తెలిసిందే.

Latest News