Site icon vidhaatha

SCR Special Trains | నల్గొండ, విజయవాడ మీదుగా.. పది ప్రత్యేక రైళ్లను ప్రకటించిన దక్షిణ మధ్య రైల్వే..!

SCR Special Trains |

వేసవి రద్దీని దృష్టిలో పెట్టుకొని ప్రయాణికుల కోసం దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. హైదరాబాద్‌ – కటక్‌ (Train No.07165) , కటక్‌ – హైదరాబాద్‌ (Train No.07166) మార్గంలో రైళ్లు నడుపనున్నది.

ఈ నెల 30, మే 6, 13, 20, 27 తేదీల్లో ఆయా రైళ్లు నడుస్తాయని దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. రైలు ఆయా రోజుల్లో రాత్రి 8.10 గంటలకు సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌ నుంచి బయలుదేరి మరుసటి రోజు సాయంత్రం 5.45 గంటలకు గమ్యానికి చేరనున్నది.

కటక్-హైదరాబాద్ రైలు ఈ నెల 31, జూన్ 7, 14, 21, 28 తేదీల్లో నడువనుండగా.. ఈ రైళ్లు రాత్రి 10.30 గంటలకు బయలుదేరి.. మరుసటి రోజు రాత్రి 9 గంటలకు సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌ చేరుకుంటుంది.

రైలు సికింద్రాబాద్, నల్గొండ, మిర్యాలగూడ, సత్తెనపల్లి, గుంటూరు, విజయవాడ, ఏలూరు, రాజమండ్రి, సామర్లకోట, అన్నవరం, అనకాపల్లి, దువ్వాడ, విజయనగరం, శ్రీకాకుళం రోడ్, పలాస, భువనేశ్వర్ స్టేషన్లలో ఆగుతుందని దక్షిణ మధ్య రైల్వే తెలిపింది.

ఏసీ 2 టైర్, ఏసీ 3 టైర్, స్లీపర్ క్లాస్, జనరల్ సెకండ్ క్లాస్ కోచ్‌లు అందుబాటులో ఉన్నాయని, అవకాశాన్ని ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలని కోరింది.

Exit mobile version