విధాత, నల్గొండ గుత్తా వెంకట్ రెడ్డి మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో 300 మంది గ్రూప్ 4 పరీక్షకు హాజరవుతున్న అభ్యర్థులకు ఎలిమినేటి మాధవరెడ్డి పోలీస్ ఆడిటోరియంలో స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహించారు. ఫోకస్ అకాడమీ సహకారంతో నిర్వహించిన ఈ స్క్రీనింగ్ టెస్ట్ కు అభ్యర్థులు భారీ సంఖ్యలో హాజరవ్వడం విశేషం.
ఈ కార్యక్రమములో బిఆర్ఎస్ నాయకులు, స్థానిక వార్డ్ కౌన్సిలర్ యమా దయాకర్ ,మాజీ మునిసిపల్ ఫ్లోర్ లీడర్ దుబ్బా అశోక్ సుందర్ ,విజిలెన్స్ &మానిటరింగ్ సభ్యులు అయితగాని స్వామి గౌడ్ , రేణుక ఎల్లమ్మ స్వామి గుడి,దరవేశిపురం మాజీ ఛైర్మన్ కoచరకుంట్ల గోపాల్ రెడ్డి, రిటైర్డ్ వార్డెన్స్ సంఘం ,అధ్యక్షుడు పాదురీ ఇంద్రసేన రెడ్డి, ప్రముఖ కవి మునాస వెంకన్న, ఏపీఎస్ అమరేంద్ర మోహన్,PA రాం ప్రసాద్,వెంకన్న తదితరులు పాల్గొన్నారు.