Site icon vidhaatha

కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి దుర్మార్గుడు.. పక్కన పెట్టాలి: సీతక్క సంచలన వ్యాఖ్యలు

విధాత: కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాంపెయినర్‌పై ములుగు కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క నిప్పులు చెరిగారు. బీజేపీ అభ్యర్థి, ఆయన సోదరుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికే ఓటేయ్యాలని కాంగ్రెస్‌ కేడర్‌కు సూచించిన వెంకట్ రెడ్డిపై సీతక్క విరుచుకు పడ్డారు. వెంకట్‌ రెడ్డి ఓ దుర్మార్గుడు.. అలాంటి వ్యక్తిని కాంగ్రెస్‌ నుంచి పక్కన పెట్టాల్సిందని అభిప్రాయపడ్డారు.

కోమటిరెడ్డి కోవర్ట్ ఆపరేషన్ సిగ్గుమాలిన చర్య అని మండిపడ్డారు. హైకమాండ్ జారీ చేసిన షోకాజ్ నోటీసుకు ఆయన జవాబు చెప్పాల్సిందేనని డిమాండ్ చేశారు. బంధాలకు అతీతమే రాజకీయం అన్నారు. నిబద్ధత గల రాజకీయాలు చేయాలనుకుంటే పార్టీ నిబంధనలు, సిద్ధాంతాలకు కట్టుబడి పని చేయాలన్నారు.

నికార్సైన కాంగ్రెసోడా మునుగోడుకు రా..! రేవంత్ రెడ్డి

తమ్ముడి గెలుపే వెంకట్‌రెడ్డికి ముఖ్యమైతే.. కాంగ్రెస్‌ కండువాను తీసి పక్కన పెట్టాలని సూచించారు. ఆపదలో అండగా ఉండాల్సింది పోయి.. ఆస్ట్రేలియాకు పోవడం ఎంతవరకు కరెక్ట్‌ అని ప్రశ్నించారు. మునుగోడులో కాంగ్రెస్ పరిస్థితి క్లిష్టంగా ఉందన్నారు. కాంగ్రెస్ శ్రేణులపై టీఆర్‌ఎస్‌, బీజేపీ నేతలు దాడులకు పాల్పడుతు న్నారని సీతక్క ఆవేదన వ్యక్తం చేశారు.

రాజగోపాల్ పై చెప్పుతో దాడికి యత్నం

Exit mobile version