విధాత: క్రియేటివ్ దర్శకుడు గుణశేఖర్ తన నిర్మాణ భాగస్వామ్యంలో దిల్ రాజుతో కలిసి శాకుంతలం సినిమాని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. అభిజ్ఞాన శాకుంతలం అనే పౌరాణిక గాథ ఆధారంగా ఈ చిత్రం రూపొందుతోంది.
సమంత టైటిల్ రోల్ పోషిస్తున్న ఈ సినిమా ట్రైలర్‌ను తాజాగా విడుదల చేశారు. సినిమా ట్రైలర్‌తోనే సినిమా స్థాయి ఏమిటన్నది గుణశేఖర్ చూపించారు. శకుంతలా దేవిగా సమంత.. దుష్యంతుడిగా దేవ్ మోహన్ తమ పాత్రలకు పూర్తి న్యాయం చేసినట్టు అనిపిస్తుంది.
ముఖ్యంగా ఎంచుకున్న ప్రతీ కథకు పూర్తిస్థాయిలో న్యాయం చేసే గుణశేఖర్ ఈ శాకుంతలం సినిమాను కూడా అదే విధంగా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. సినిమాలో ముఖ్యంగా విజువల్స్ అదిరిపోయే లెవల్‌లో ఉన్నాయి. గుణశేఖర్ మార్క్ సెట్స్‌కి డోకా లేదు. గుణశేఖర్ సినిమాలంటేనే భారీ భారీ సెట్స్ ఉంటాయి. దానికి తగ్గట్టుగానే దీంట్లో కూడా సెట్స్ అదిరిపోయే విధంగా ఉండి సినిమాకు గ్రాండియర్ లుక్కును తీసుకుకొచ్చాయి. తనకున్న ఆర్ట్‌ను ఇలాంటి సినిమాలతో గుణశేఖర్ మరలా మరలా ప్రూవ్ చేసుకుంటూనే వస్తున్నాడు.
గుణశేఖర్ ‘రుద్రమదేవి’ తర్వాత చేసిన ఈ మూవీ మరో సెన్సేషన్ అవుతుందని చెప్పడంలో పెద్దగా సందేహం లేదు. శకుంతలా దేవిగా సమంత పర్ఫామెన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సినిమాతో మరోసారి సమంత తన నట విశ్వరూపం చూపించబోతుందని చెప్పవచ్చు.
దుష్యంతుడు శకుంతలా దేవిల అద్భుత ప్రేమ కావ్యాన్ని దృశ్యరూపంగా ఆయన తెరకెక్కించే విధానం తెలుగు సినిమా స్థాయిని పెంచే విధంగా ఉంది. ఎన్నో అవార్డులు రివార్డులు గెలుచుకునే దిశగా ఈ చిత్రం సాగుతోందనడంలో సందేహం లేదు. ట్రైలర్ అదిరిపోయింది.
సినిమాలో మరిన్ని సర్ప్రైజ్ ఉంటాయని తెలుస్తుంది. ఈ సినిమాలో అల్లు అర్జున్ కుమార్తె అల్లు అర్హ కూడా నటించిన సంగతి తెలిసిందే. రుద్రమదేవిలో అల్లు అర్జున్ గోన గన్నారెడ్డిగా నటించిగా ఇందులో ఆయన కుమార్తె నటిస్తూ ఉండడం విశేషం. నేను తెలుగు భాష లెక్క… ఆడా ఉంటా ఈడా ఉంటా…. అన్నట్లుగా ఈ రెండు సినిమాల్లోనూ అల్లు వారి భాగస్వామ్యం ఉండడం విశేషం.
ఇక నేటితరానికి శకుంతల, దుష్యంతుల అద్భుత ప్రేమగాథను తెలిపేలా ఈ చిత్రాన్ని తీయడం నిజంగా అభినందనీయం. ఇది గుణశేఖర్ ప్రతిభకు, ఆయన గట్స్‌కి కోట్లకు కోట్లు ఖర్చుపెట్టి ఓ పౌరాణిక ప్రేమగాథను చెప్పాలనే ఆయన కోరికను ఈ చిత్రం తీరుస్తోంది.
ఇలాంటి చిత్రాలు విడుదలై మంచి విజయం సాధించి, ప్రేక్షకులను మెప్పించినప్పుడే ఇలాంటి మరికొన్ని అపురూప చిత్రాలను వారు తీయగలుగుతారు. ఫిక్షనల్ స్టోరీని ఎంచుకోకుండా పౌరాణిక గాధను ఎంచుకోవడమే గుణశేఖర్ ధైర్యాన్ని తెలియజేస్తుంది. ఇక ఇందులోని ఓ డైలాగ్ అదిరిపోయే రీతిలో ఉంది.
మాయ ప్రేమను మరిపిస్తుందేమో గాని అభిమానాన్ని, అవమానాన్ని ఏ మాయ మరిపించలేదు అంటూ సమంత చెప్పే డైలాగ్ ఈ ట్రైలర్ కి హైలెట్. సమంత నటన, నటీనటుల సంభాషణలు అదిరిపోయేలా ఉన్నాయి. మొత్తానికి శాకుంతలం చిత్రం ఓ అపురూపమైన కళాఖండంగా రూపుదిద్దుకుంటున్నది అనడంలో సందేహం లేదు.