విధాత, వైఎస్ షర్మిల తన పాదయాత్ర పున ప్రారంభం సందర్భంగా సీఎం కేసీఆర్ కు షు బాక్స్ గిఫ్ట్ ను ప్రకటించారు. సీఎం కేసీఆర్ పాలనలో రాష్ట్రంలో ప్రజా సమస్యలు లేవంటూ బిఆర్ఎస్ నాయకులు చెబుతున్నారని, తనతో సీఎం కేసీఆర్ పాదయాత్ర చేస్తే ప్రజా సమస్యలను స్వయంగా చూపిస్తానని, సమస్యలు లేకుంటే నా ముక్కు నేలకు రాసి రాజకీయాల నుంచి విరమించుకుంటానని వైయస్సార్ బిడ్డగా చెబుతున్నానన్నారు. ప్రజా సమస్యలు ఉంటే కేసీఆర్ రాజీనామా చేయాలన్నారు.
కేసీఆర్ కు ఆయన పాలనపై నమ్మకం ఉంటే తనతో ఒక్కరోజు పాదయాత్ర చేయాలని సవాల్ చేశారు. కెసిఆర్ తనతో పాదయాత్రలో నడిచేందుకు కావలసిన షూస్ బాక్స్ గిఫ్ట్ గా అందించనున్నట్లుగా తేలిపారు. పాదయాత్రలో భాగంగా నియోజకవర్గాల్లో ఆయా ప్రాంత ఎమ్మెల్యేలు ఇచ్చిన హామీలపై తప్పకుండా ప్రశ్నించాల్సి ఉంటుందని, అది విపక్ష నేతగా తన బాధ్యత అన్నారు, తాను వ్యక్తిగత విమర్శలు చేయబోనని బిఆర్ఎస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలపైనే పాదయాత్రలో ప్రశ్నించడం జరుగుతుందన్నారు.