Site icon vidhaatha

జస్ట్‌ మిస్‌.. కదిలిన రైలు దిగుతూ పడిపోయింది (వీడియో)

విధాత: కదులుతున్న రైలు నుంచి కిందకు దిగడానికి ప్రయత్నిస్తూ ఓ మహిళ కాలు జారి పడిపోయింది. దీంతో రైలుకు, ప్లాట్‌ఫాంకు మధ్యలో ఇరుక్కుపోయింది. అక్కడున్న రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ అధికారి తక్షణమే స్పందించి మహిళ ప్రాణాలు కాపాడాడు. తీవ్ర గాయాలపాలైన ఆమెను హుటాహుటిన ఆస్పత్రికి తరలించాడు.

ఈ ఘటన బిహార్ ముజఫర్‌పుర్ రైల్వే స్టేషన్‌లో శనివారం జరిగింది. ప్రమాదానికి గురైన మహిళను అంబిషా ఖాతూన్‌గా గుర్తించారు. విష్ణుపుర నుంచి నరకటిగంజ్‌కు వెళ్తున్న అంబిష ఖతూన్.. ముజఫర్‌ పూర్ రైల్వే స్టేషన్‌లో ట్రైన్‌ కోసం ఎదురు చూస్తోంది. ప్లాట్‌ఫామ్‌పై బాత్‌రూమ్ లేకపోవటంతో కాలకృత్యాలు తీర్చుకునేందుకు గ్వాలియర్ ఎక్స్‌ప్రెస్ ఎక్కింది.

అయితే.. ఎక్కిన వెంటనే ఉన్నట్టుండి రైలు కదిలింది. ఏం చేయాలో తెలియక వెంటనే అందులో నుంచి కిందకు దిగేందుకు ప్రయత్నించింది. ఈ క్రమంలోనే కాలు జారి ప్లాట్‌ఫామ్‌ మధ్య ఇరుక్కుపోయింది. ఆర్పీఎఫ్‌ పోలీసులు తక్షణమే స్పందించకపోయుంటే.. తీవ్ర నష్టం జరిగుండేది.

ఆర్‌పీఎఫ్‌ పోలీసుల చొరవతో స్వల్ప గాయాలతో బయట పడింది. కదులుతున్న రైల్లోకి ఎక్కడం, రైల్లో నుంచి దిగడం ప్రమాదకరం అని రైల్వే స్టేషన్లలో మైక్‌లు పెట్టి మరీ చెప్తున్న ఎవరూ పట్టించుకోవటం లేదు. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మధ్యమాల్లో వైరల్‌గా మారింది.

Exit mobile version