Mumbai Murder Case | మహారాష్ట్ర రాజధాని ముంబై నగరంలో దారుణ హత్య వెలుగు చూసిన సంగతి తెలిసిందే. తన వద్ద సహజీవనం చేస్తున్న మహిళను అత్యంత దారుణంగా నరికి చంపి, ఆమె శరీరా భాగాలను కుక్కర్‌లో ఉడికించాడు. అంతే కాదు.. ఆ శరీర భాగాలను కొన్నింటిని మిక్సి కూడా చేశాడు. మొత్తానికి మర్డర్ కేసు బయటకు రాకుండా ఉండేందుకు, ఆ ఆనవాళ్లను రూపుమాపేందుకు నిందితుడు అన్ని విధాలా ప్రయత్నించినట్లు తెలుస్తోంది.
అయితే సరస్వతి వైద్య దారుణ హత్యకు గురైన నేపథ్యంలో ఓ అనాథ వసతి గృహం యజమాని స్పందించారు. సరస్వతి వైద్య అనాథ అని తెలిపారు. ఆమె తమ వసతి గృహంలోనే పెరిగి పెద్దదైంది. ఆ తర్వాత కొన్నాళ్లకు తమ వసతి గృహం నుంచి బయటకు వెళ్లింది.
రెండేండ్ల క్రితం వసతి గృహానికి వచ్చింది. ముంబైలో తన అంకుల్‌తో ఉంటున్నానని చెప్పింది. అతను బట్టల వ్యాపారి అని, ధనవంతుడు అని తెలిపింది. కానీ చివరిసారి తన వద్దకు వచ్చినప్పుడు సరస్వతి మనసులో ఏదో బాధ ఉన్నట్లు అనిపించిందని అనాథ వసతి గృహం యజమానురాలు మీడియాకు వెల్లడించింది.
మనోజ్ సానీ గురించి పోలీసులు కీలక విషయాలు వెల్లడించారు. మనోజ్ సానీ పెళ్లి చేసుకోలేదని పోలీసులు తెలిపారు. ముంబైలోని బోరివాలిలో ఆయనకు సొంతిల్లు ఉందని చెప్పారు. తన కుటుంబ సభ్యులతో కాకుండా ముంబైలోని మీరా రోడ్డులోని ఓ అపార్ట్‌మెంట్లో ఉంటున్నాడు. 2014లో సరస్వతి వైద్య మనోజ్ సానీకి పరిచయం అయింది. 2016 నుంచి వారిద్దరూ సహజీవనంలో ఉన్నట్లు పోలీసుల విచారణలో తేలింది. మూడేండ్ల క్రితమే మీరా రోడ్డులోని అపార్ట్‌మెంట్‌లోకి వెళ్లారు.