విదాత, సినిమా: శోభిత ధూళిపాళ.. ఈ పేరు ఈ మధ్య బాగా వినబడుతోంది. ముఖ్యంగా సమంతతో విడాకుల తర్వాత.. నాగచైతన్య ఈ భామతో డేటింగ్‌లో ఉన్నాడని, త్వరలోనే వీరు పెళ్లి కూడా చేసుకోబోతున్నారనేలా వార్తలు వస్తుండటంతో.. ఈ భామ పేరు ఈ మధ్యకాలంలో హైలెట్ అవుతోంది. అసలు నిజంగా నాగచైతన్యతో డేటింగ్‌లో ఉందా? లేదా? అనే విషయం పక్కన పెడితే.. ఈ భామ ఎక్కడుంటే అక్కడ.. చైతూ వాలిపోతుండటంతో వారి రిలేషన్‌పై అనుమానాలు ఎక్కువయ్యాయి.
ఇక చైతూ సంగతి పక్కన పెడితే.. ఈ భామకి ఎక్కడో సుడి ఉంది. అందుకే ‘మేజర్’, ‘పొన్నియిన్ సెల్వన్’ వంటి చిత్రాలలో చేసింది చిన్న పాత్రే అయినా.. ఆ పాత్రలతోనే మంచి గుర్తింపును తెచ్చుకుని.. సక్సెస్‌ఫుల్ హీరోయిన్‌గా ముద్ర వేయించుకుంది. ఇప్పుడు నటిగా కూడా ఆమె బిజీ అవుతోంది. ఈ నేపధ్యంలో తాజాగా ఆమె చేసిన యాడ్.. మరోసారి ఆమెను వార్తలలో నిలుపుతోంది.
వాస్తవానికి ఆమె ఆంధ్రప్రదేశ్‌కి చెందిన ఓ బ్రాహ్మణ కుటుంబానికి చెందిన యువతి. అలాంటి ఆమెను ఇటువంటి యాడ్‌లో చూడడం కాస్త.. ఇబ్బందికరమైన విషయమే అయినా.. వృత్తి ధర్మం పాటించాలి కాబట్టి.. శోభిత ఈ యాడ్‌లో నటించినట్లుగా భావించవచ్చు.
ఈ యాడ్‌లో శృంగారానికి సంబంధించిన భంగిమలను చూపిస్తూ.. ఓ రేంజ్‌లో రెచ్చిపోయిందని చెప్పుకోవచ్చు. యాడ్ చివరిలో రణ్వీర్ సింగ్ వచ్చే వరకు ఇది కండోమ్ యాడ్ అని అనిపించదు. కావాలని శోభిత ఏదో చేస్తున్నట్లుగా అనిపిస్తుంది.
మొత్తంగా చూస్తే మాత్రం.. శృంగారంలోని పలు భంగిమలను చూపిస్తూ.. ఆమె చేసిన హడావుడి ఇప్పుడు సోషల్ మీడియాని షేక్ చేస్తుంది. ఆ భంగిమలు ఏంటమ్మో.. అప్పుడే ఎక్కేసిందా? అంటూ కొందరు ఆమె చేసిన యాడ్‌కు కామెంట్స్ చేస్తున్నారు. ఇది డురెక్స్ అనే కండోమ్ యాడ్. జీన్స్ ఫ్యాంట్ జేబులో కూడా కనిపించనంతగా.. ఇవి ఉంటాయని చెప్పడానికి చేసిన యాడ్. ఈ యాడ్‌లో శోభిత ధూళిపాళ ఇచ్చిన ఎక్స్‌ప్రెషన్స్..
అయితే మాములుగా లేవు. ఈ యాడ్‌తో ఆమెకు హీరోయిన్ అవకాశాలు కూడా పుష్కలంగా వచ్చే అవకాశం ఉందనేలా టాక్ నడుస్తుందంటే.. ఏ స్థాయిలో దీనికి ఆమె న్యాయం చేసిందో అర్థం చేసుకోవచ్చు.
మరి అన్నీ వదిలేసి వృత్తి ధర్మం కోసం కట్టుబడిన శోభితకు ముందు ముందు ఎటువంటి అవకాశాలు వరిస్తాయో చూద్దాం. మరో విషయం ఏమిటంటే.. ఇది ఇప్పటి యాడ్ కాదు.. ఈ యాడ్ వచ్చి దాదాపు నాలుగు సంవత్సరాలు అవుతుంది. కానీ ఇప్పుడు ఈ యాడ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటం విశేషం.