విధాత, బ్యూరో మెదక్ ఉమ్మడి జిల్లా: జగిత్యాల జిల్లా నూతన కలెక్టరేట్ భవనం ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొనడానికి జగిత్యాల వెళుతున్నరాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్‌కు బుధవారం ఉదయం జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ ములుగు మండలం వంటిమామిడి వద్ద స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా సిద్దిపేటలోని కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో జిల్లా కలెక్టర్, కమిషనర్ ఆఫ్ పోలీస్ శ్వేతతో కలిసి అల్పాహారం తీసుకున్న అనంతరం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జిల్లాలో జరుగుతున్న పాలనా పరమైన విషయాలు, ప్రభుత్వ పథకాల అమలు గూర్చి చర్చించారు.
పథకాల అమలులో అగ్ర స్థానంలో నిలిచేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. జిల్లా అదనపు కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ కూడా చీప్ సెక్రటరీని మర్యాదపూర్వకంగా కలిసి పూల మొక్కను అందజేశారు.
RGV – Ashu Reddy | అషురెడ్డి పాదాలను ముద్దాడిన ఆర్జీవీ.. వీడియో వైరల్..!