Site icon vidhaatha

శ్రేయాస్ సెంచ‌రీ.. భార‌త్ సూప‌ర్ విక్ట‌రీ

విధాత,రాంచీ: సౌతాఫ్రికాతో జ‌రిగిన రెండో వన్డేలో భారత్‌ 7 వికెట్ల తేడాతో ఘ‌న‌ విజయం సాధించింది. మొద‌ట బ్యాటింగ్ చేప‌ట్టిన సఫారీ జ‌ట్టు 7 వికెట్ల న‌ష్టానికి 279 పరుగులు సాధించింది. సౌతాఫ్రికా నిర్దేశించిన లక్ష్యాన్నిభార‌త్ 3 వికెట్లు కోల్పోయి 45.5 ఓవర్లలోనే ఛేదించింది.

బ్యాటింగ్‌లో శ్రేయస్‌(113 నౌటౌట్) చెలరేగి వన్డేల్లో రెండో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఇషాన్‌ కిషన్ (93) స్వ‌ల్ప తేడాతో సెంచరీ చేజార్చుకున్నాడు. శుభ్‌మన్‌(28), సంజు శాంసన్‌(30 నాటౌట్‌) కూడా ఫర్వాలేదనిపించారు.

స‌ఫారీ జ‌ట్టు బౌలర్లలో వ్యాన్‌ పార్నెల్, కగిసో రబాడ, ఫొర్టైన్ చెరో వికెట్‌ తీశారు. దీంతో మూడు వన్డేల సిరీస్‌లో ఇరు జట్లు 1-1తో సమంగా నిలిచాయి. ఎల్లుండి సిరీస్ నిర్ణ‌యాత్మ‌క మూడో వ‌న్డేలో ఢిల్లీలో జ‌ర‌గ‌నున్న‌ది.

అంత‌కుముందు బ్యాటింగ్ చేప‌ట్టిన ద‌క్షిణాఫ్రికా జ‌ట్టులో మ‌ర్‌క్ర‌మ్ 79, హెండ్రిక్ 74, మిల్ల‌ర్ 35 ప‌రుగులు చేయ‌డంతో భారీ స్కోర్ సాధించింది. భార‌త బౌల‌ర్ల‌లో మ‌హ‌మ్మ‌ద్ సిరాజ్ 3 వికెట్లు తీశాడు.

Exit mobile version