Site icon vidhaatha

పేదవాడి ముఖంలో చిరునవ్వు చూస్తేనే మన జన్మ ధన్యం: కేటీఆర్

విధాత, హైదరాబాద్: ఎనిమిదేండ్ల కింద తెలంగాణ ప్రభుత్వం ఏర్పడినప్పుడు కేసీఆర్ చెప్పింది ఒక్కటే. పేదవాడి ముఖంలో చిరునవ్వు చూస్తేనే మన జన్మ ధన్యమైతదని చెప్పారు. కులం, మతమని చూడలేదు. అభివృద్ధి కులం, సంక్షేమమే మతం, జనహితమే మన అభిమతం అని చెప్పి ముందుకు పోతున్నాం.

ఇవాళ తెలంగాణలో దేశంలో ఎక్కడా లేని సంకక్షేమ పథకాలు అమలవతున్నాయి. పేదరికమే ప్రాతి పదికగా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామన్నారు. పారిశ్రామికవేత్తల నుంచి కార్మికులు, శ్రామికుల బాగోగులు చూస్తున్నామన్నారు. నాడు ఉద్యమంలో ఉన్న సమయంలో.. మా దోస్తులు మీకు తెలంగాణ వస్తే రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోయే దమ్మున్న నాయకత్వం మీకు ఉందా? అని అడిగేవారని ఈ సందర్భంగా మంత్రి గుర్తు చేశారు.

కానీ ఈరోజు ప్రపంచంలోనే నగరాలను దాటుకొని, మన హైదరాబాద్‌ వరల్డ్ గ్రీన్ సిటీ అవార్డు వచ్చిందని అది మన దమ్ము అని అన్నారు. మన కేసీఆర్ నాయకత్వ పటిమకు ఈ అవార్డు నిదర్శనమన్నారు.

Exit mobile version