Site icon vidhaatha

కాటేసిందని పామును కొరికిన బాలుడు.. అక్కడికక్కడే చచ్చిన నాగుపాము

King Cobra | విధాత: ఇటీవలి కాలంలో నాగుపాముల బెడద ఎక్కువైపోయింది. చాలా గ్రామాల్లో ఎక్కడ అంటే అక్కడ దర్శనమిస్తున్నాయి. బైకుల్లో దూరడం, దుప్పట్లోకి దూరడం వంటి ఘటనలు చూస్తూనే ఉన్నాం. తాజాగా ఓ 8 ఏండ్ల బాలుడిని నాగుపాము కాటేసింది. ఆ బాధతో తిరిగి ఆ పామునే గట్టిగా కొరికాడు. ఇంకేముంది పాము విలవిలలాడి చనిపోయింది. ఈ షాకింగ్ ఘటన ఛత్తీస్ గఢ్ లోని జష్పూర్ జిల్లాలో వెలుగు చూసింది.

మునుగోడు ఫలితాలు: 1631 ఓట్ల అధిక్యంలో టీఆర్‌ఎస్‌

వివరాల్లోకి వెళ్తే.. దీపక్(8) అనే బాలుడు తన ఇంటి పెరట్లో ఆడుకుంటున్నాడు. మెల్లిగా ఆ బాలుడి వద్దకు నాగుపాము వచ్చింది. ఆ పామును బాలుడు గమనించలేదు. ఇక బాలుడిని పాము కాటేసింది. చేతిని చుట్టేసింది పాము. భయంతో వణికిపోయిన ఆ బాలుడు పాము బారి నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నించాడు. కానీ విఫలమైంది. ధైర్యంతో ఆ పామును తన నోటితో గట్టిగా రెండుసార్లు కొరికాడు. ఆ తర్వాత పాము అతన్ని వదిలిపెట్టింది. విలవిలలాడి ఆ నాగుపాము చనిపోయింది.

మునుగోడు: ఫలితాల వెల్లడి అనుమానాస్పదంగా ఉంది: బండి సంజయ్‌

ఇక ఇంట్లోకి పరుగెత్తుకుంటూ వచ్చిన దీపక్ తన తల్లిదండ్రులకు జరిగిన విషయాన్ని చెప్పాడు. అప్రమత్తమైన పేరెంట్స్ హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు దీపక్ ను. అక్కడ వైద్యులు యాంటీ వీనమ్ ఇంజక్షన్ ఇచ్చి ఒకరోజు అబ్జర్వేషన్ లో ఉంచారు. బాలుడికి ఎలాంటి హానీ సంభవించలేదు. అయితే దీపక్ ను పాము కాటేసినప్పుడు అది.. విషాన్ని విడుదల చేయలేదని వైద్యులు తేల్చారు. దాంతో బాలుడు ప్రాణాలతో బయటపడ్డాడు అని పేర్కొన్నారు.

యాక్టివాలోకి దూరిన నాగుపాము.. ఈ వీడియో చూడాలంటే ధైర్యం ఉండాల్సిందే..

Exit mobile version