విధాత: యూపీఏ చైర్‌పర్సన్ సోనియా గాంధీ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో వెంటనే ఆమెను ఢిల్లీలోని సర్ గంగారామ్ ఆస్పత్రిలో చేర్పించారు. ప్రియాంక గాంధీ వాద్రా తన తల్లి సోనియాను దగ్గరుండి ఆస్పత్రికి తీసుకెళ్లారు. శ్వాస వ్యవస్థతలో ఇబ్బందులు తలెత్తడంతో.. సోనియాను ఆస్పత్రికి తీసుకెళ్లినట్లు తెలిపారు.
ప్రస్తుతం సోనియాకు డాక్టర్ అరూప్ బసు ఆధ్వర్యంలో చికిత్స కొనసాగుతోంది. గతేడాది సోనియా గాంధీ కొవిడ్ సంబంధిత సమస్యలతో బాధ పడుతూ.. జూన్ 12న గంగారామ్ ఆస్పత్రిలో చేరిన సంగతి తెలిసిందే. 6 రోజుల పాటు చికిత్స పొంది జూన్ 18న ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. 2022లో ఆమె రెండు సార్లు కరోనా బారిన పడ్డారు.