Site icon vidhaatha

Southwest Monsoon | రైతులకు తీపికబురు.. ఈ ఏడాది సాధారణ వర్షపాతమే: ఐఎండీ

Southwest Monsoon |

వాతావరణ శాఖ రైతులకు తీపికబరును అందించింది. ఈ ఏడాది సాధారణ వర్షపాతం నమోదవుతుందని తెలిపింది. జూన్‌ మొదటి వారంలో కేరళను నైరుతి రుతుపవనాలు తాకనున్నాయని పేర్కొంది. ఈ సంవత్సరం నైరుతి రుతుపవనాలు మూడు రోజులు ఆలస్యంగా కేరళలోకి ప్రవేశించనున్నాయని చెప్పింది.

ఈ ఏడాది సాధారణ వర్షపాతంలో 96శాతం వర్షాలు కురిసే అవకాశాలున్నాయని అంచనా వేసింది. రుతుపవనాలు సాధారణం కంటే 92 శాతం కంటే తక్కువగా రావడంతో దేశంలోని వాయవ్య ప్రాంతంలో వానలు కాస్త తక్కువగా ఉండే అవకాశాలున్నాయని తెలిపింది.

రాగల రెండు రోజులు రుతుపవనాలు ముందుకు సాగేందుకు అనువైన పరిస్థితులు నెలకొంటాయని తెలిపింది. దేశవ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో జూన్‌లో సాధారణం కన్నా తక్కువ వర్షపాతం నమోదు అవుతుందని అంచనా వేసింది.

దక్షిణ ద్వీపకల్ప భారతదేశం, ఈశాన్య భారత దేశం, ఉత్తర భారతంలోని ఐసోలేటెడ్ ప్రాంతాల్లో సాధారణం కన్నా ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశాలున్నాయని చెప్పింది.

ఈ ఏడాది పసిఫిక్ మహాసముద్రంలో నీరు వేడెక్కడంతో ఎల్‌ నినో పరిస్థితులు ఏర్పడుతున్నప్పటికీ ఈ సీజన్‌లో నైరుతి రుతుపవనాల్లో సాధారణ వర్షపాతం ఉంటుంది వివరించింది.

అయితే, దేశంలో 94-106 శాతం వర్షాలు కురిస్తే సాధారణ వర్షపాతంగా పేర్కొంటారు. భారత్‌ వ్యవసాయరంగంపై రుతుపవనాలు కీలక ప్రభావాన్ని చూపుతాయి. ఈ రుతు పవనాల సమయంలో దేశంలో పంటల సాగు అధికంగా ఉంటుంది.

Exit mobile version