Site icon vidhaatha

కరీంనగర్ జైలుకు సంజయ్ తో పాటు మరో ముగ్గురు

* సంజయ్ తో పాటు మరో ముగ్గురు కరీంనగర్ జైలుకు
* వేరే ప్రాంతానికి తరలిస్తే ఆయనకు హాని ఉందని బిజెపి లీగల్ టీం అభ్యర్థన
* కరీంనగర్ జిల్లా జైలుకు తరలించాలని మెజిస్ట్రేట్ కు విజ్ఞప్తి
* వారి విజ్ఞప్తిని మన్నించిన న్యాయమూర్తి

విధాత బ్యూరో కరీంనగర్: ప్రశ్నాపత్రాల లీకేజీ లీకేజీ కేసులో బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ తో పాటు పోలీసులు నిందితులుగా కేసు నమోదు చేసిన ప్రశాంత్, మహేష్, శివ గణేష్ లను కరీంనగర్ జిల్లా కారాగారానికి తరలించారు.ఈ నలుగురిని పటిష్టమైన బందోబస్తు మధ్య వరంగల్ జిల్లాకు చెందిన పోలీస్ వాహనాలలో ఇక్కడికి తీసుకువచ్చారు. బండి సంజయ్ కుమార్ సతీమణి అపర్ణ, కుటుంబ సభ్యులు జైలు ముందట వేచి ఉన్నప్పటికీ వారితో మాట్లాడే అవకాశం కల్పించలేదు. తొలుత బండి సంజయ్ ని ఖమ్మం జిల్లా కేంద్రకారాగారానికి తరలించాలని భావించారు.
అయితే అక్కడ ఆయనకు హాని జరిగే అవకాశం ఉన్నందున కరీంనగర్ జిల్లా జైలుకు తరలించాలని బిజెపికి చెందిన లీగల్ టీం సభ్యులు మెజిస్ట్రేట్ను అభ్యర్థించారు.
వారి అభ్యర్థనను మన్నించిన జడ్జ్ సంజయ్ తో పాటు మరో ముగ్గురిని కరీంనగర్ కారాగారం తరలించాలని ఆదేశించారు. చివరి క్షణంలో జైలు మార్పిడి కారణంగా ఎలాంటి ఫార్మాలిటీస్ కు తావు లేకుండానే వీరందరిని వారికి కేటాయించిన బేరక్ లకు తరలించారు.

Exit mobile version