ఈడీకి మరింత పదును!!
ఇక రాజకీయ టార్గెట్లు మరింత సులువు!!
విధాత: ఇప్పటికే సీబీఐ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, ఇన్‌కమ్ ట్యాక్స్ వంటి పలు కేంద్ర దర్యాప్తు సంస్థలు తమను టార్గెట్ చేసి మరీ ఇబ్బందులు పెడుతున్నాయని ప్రతిపక్షాలు గగ్గోలు పెడుతున్న తరుణంలోనే కేంద్రం ఇంకో నిర్ణయం తీసుకుంది. ఈడీకి మరిన్ని అధికారాలు ఇస్తూ మరింత విస్తృతమైన పరిధిని ఇస్తూ కేంద్రం ఉత్తర్వులు ఇచ్చింది.
బెంగాల్, తెలంగాణ, కేరళ , చత్తీషుగడ్ వంటి ప్రతిపక్ష పార్టీలు ఉన్న రాష్ట్రాల్లో వివిధ అక్రమాలు, కుంభకోణాలు పేరిట సీబీఐ, ఈడీలు అక్కడి అధికారులు, నాయకులు భయంతో వణికి పోతున్నారు. ఇవన్నీ రాజకీయపరమైన దాడులు అంటూ వాళ్ళు ఆరోపణలు చేస్తున్నారు. అయినా సరే కేంద్రం తన ప్లాన్స్ అమలు చేస్తూనే ఉంది.
ఈ క్రమంలోనే ఈడీ మరో 15కు పైగా ఏజెన్సీలతో సమాచారాన్ని పంచుకునేందుకు అవకాశం ఇచ్చారు. ఈ 15 ఏజెన్సీల్లో రాష్ట్రాల పోలీసులు వ్యవస్థలు కూడా ఉన్నాయి. రాష్ట్ర పోలీసు విభాగాలను ఇది ఈడీ పరిధిలోకి తీసుకొస్తోంది. ఈడీ కోరిన ఏ సమాచారమైనా రాష్ట్రాల పోలీసులు ఇవ్వాల్సిందే.
అయితే ఏజెన్సీకి అందిన సమాచారం ఆధారంగా అరెస్టులు లేదా ఆస్తులను అటాచ్ చేయవచ్చనీ ఏజెన్సీల మధ్య సమాచారాన్ని పంచుకోవడం ద్వారా కొన్ని నిబంధనలు దుర్వినియోగమయ్యే అవకాశం ఉందని రాష్ట్రాలు భయపడుతున్నాయి.
ఇప్పటివరకూ రాష్ట్రాల పోలీసు వ్యవస్థలు స్వతంత్రంగా ఉన్నాయి. కానీ ఈడీతో సమాచారం పంచు కోవాలన్న నిబంధనల కారణంగా బీజేపీయేతర ప్రభుత్వాలు ఉన్న చోట్ల.. పరోక్షంగా పోలీసు వ్యవస్థపై పెత్తనం పెరుగుతుందని అంటున్నారు.
దేశంలో పలు ఆర్థిక లావాదేవీలు మీద దృష్టిపెట్టిన ఈడీ అనుమానం వచ్చిన వాళ్ళందరినీ ఈడీ టార్గెట్ పెట్టి. ఏంటాడేస్తున్నా విషయం తెలిసిందే. ఇప్పటికే కేసీఆర్, మల్లారెడ్డి, కవిత తదితరులంతా ఈడీ పరిద్తిలో ఉంటూ కొట్టుమిట్టాడుతున్నారు.ఇక ఇప్పుడు దాని పరిధి పెరిగితే ఇక పరిస్థితి ఎలా ఉంటుందో అని భయపడుతున్నారు.