విధాత, నాగార్జున సాగర్ లో నిర్మించిన బుద్ధ వనాన్ని మంగళవారం నాడు ముంబై యూనివర్సిటీ కి చెందిన పురావస్తు విభాగం శాఖ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ డాక్టర్ యోజన భగత్ ఆధ్వర్యంలో 100 మంది విద్యార్థులు సందర్శించారు.
ఈ సందర్భంగా ఈ బృందం బుద్ధ చరిత వనం , జాతకవనం, స్తూప వనం, ధ్యానవనం సందర్శించి అధ్యయనం చేశారు.
అనంతరం వీరు మహా స్తూపం అంతర్భాగంలోని ధ్యాన మందిరంలో ధ్యానం చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ యోజన భగత్ మాట్లాడుతూ దేశంలోని పురాతన బౌద్ధ చరిత్ర కలిగిన ప్రదేశాలను సందర్శించి అధ్యయనం చేస్తున్నామని దానిలో భాగంగానే ఆంధ్రా తెలంగాణ ప్రాంతంలోని బౌద్ధ క్షేత్రాలను సందర్శిస్తున్నామన్నారు.
నాగార్జునసాగర్ లో గౌతమ బుద్ధుని జీవిత చరిత్రను, బౌద్ధ విశేషాలను మహస్తుపాన్ని అత్యుత్తమ ప్రమాణాలతో నిర్మించిన తెలంగాణ టూరిజానికి , బుద్ధవనం ప్రత్యేక అధికారి మల్లెపల్లి లక్ష్మయ్యకు ధన్యవాదాలు తెలిపారు. వీరికి స్థానిక టూరిజం గైడ్ సత్యనారాయణ బుద్ధవనం విశేషాలను వివరించారు.