విధాత, నల్గొండ: సూర్యాపేట జిల్లా కలెక్టరేట్‌లో సోమవారం జరిగిన ప్రజావాణి కార్యక్రమంలో నలుగురు వ్యక్తులు పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యకు ప్రయత్నించడం కలకలం రేపింది. గరిడేపల్లి మండలం కల్మల చెర్వుకు చెందిన రెండు కుటుంబాలకు చెందిన నలుగురు భూ వివాదంలో తమను పోలీసులు వేధిస్తున్నారని ఆరోపిస్తూ తమకు న్యాయం చేయాలని కోరుతూ ఆత్మహత్య యత్నం చేశారు.
బాధితులు తల్లి కూతుళ్నలైన మీసాల స్వాతి, మీసాల అన్నపూర్ణ, తల్లి తనయులు పున్న వీరమ్మ, సైదులు ఆత్మహత్యాయత్నం చేసి అధికారుల ముందు తమ నిరసన తెలిపారు. పెట్రోల్ పోసుకునే క్రమంలో వారిని అక్కడున్న సిబ్బంది, అధికారులు అడ్డుకుని వారిని శాంతింపజేశారు వారి సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు