విధాత: ఎన్నికల కమిషనర్ల (Election Commissioners) నియామకాలపై సుప్రీంకోర్టు (Supreme Court) కీలక ఆదేశాలు జారీ చేసింది.
ప్రధానమంత్రి (Prime Minister), ప్రతిపక్ష నేత (Opposition Leader), సీజేఐ (CJI) సభ్యులుగా ఉన్న కమిటీయే నియమించాలని ఐదుగురు సభ్యులతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది.
ప్రతిపక్ష నేత లేకపోతే లోక్‌సభలో విపక్ష మెజారిటీ పార్టీ సభ్యుడు కమిటీలో ఉండాలని పేర్కొన్నది. కమిటీ సిఫార్సుల మేరకే ఈసీలను రాష్ట్రపతి (President) నియమించాలని ఆదేశించింది.
ప్రజాస్వామ్యంలో ఎన్నికల నిర్వహణ పారదర్శకంగా ఉండాలని, లేకపోతే వినాశకర పరిణామాలకు దారి తీస్తుందని ఈ సందర్భంగా అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది.
రాజ్యాంగ పరిధిలోనే ఈసీ పనిచేయాలని పేర్కొన్నది. ఎన్నికల కమిషన్ న్యాయబద్ధంగా వ్యవహరించాలని సూచించింది.