విధాత, మైదరాబాద్: తెలుగు దేశం పార్టీ అఫీషియల్ ట్విట్టర్ అకౌంట్ హ్యాక్ అయ్యింది. టైలర్ హాబ్స్ పేరుతో హ్యాకర్లు మార్చారు. అలాగే ఆ ఖాతాలో టీడీపీ పోస్టులకు బదులుగా విజువల్ ఆర్ట్స్‌కు చెందిన పోస్టులు కనిపిస్తున్నాయి. టీడీపీ డిటిజల్ వింగ్ శనివారం మధ్యాహ్నం ట్విట్టర్ వేదికగా ఓ ప్రకటించింది.
వైసీపీ మద్దతుదారులు ట్విట్టర్ ఖాతాను హ్యాక్ చేశారని టీడీపీ ఆరోపిస్తోంది. అతి త్వరలోనే టీడీపీ ఖాతాను అందుబాటులోకి తీసుకు రానున్నామని ప్రకటించారు. గతంలోనూ టీడీపీ ట్విట్టర్ అకౌంట్ సైబర్ కేటుగాళ్లు హ్యాక్ చేశారు.
అప్పుడు కూడా ఈ విషయాన్ని టీడీపీ ఐటీ విభాగం గుర్తించి వెంటనే అప్రమత్తమైంది. ట్విట్టర్‌లో అసభ్య మెసేజ్‍లు పంపినట్టు గుర్తించింది. అయితే ఎలాంటి నష్టం జరగలేదని టీడీపీ ఐటీ విభాగం స్పష్టం చేసింది.