Site icon vidhaatha

Bhatti Vikramarka: ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు తెలంగాణ సర్కార్ తీపి కబురు

విధాత, హైదరాబాద్ : ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు తెలంగాణ సర్కార్ తీపి కబురు తెలిపింది. పెండింగ్ లో ఉన్న రూ.180.38 కోట్ల మెడికల్ రీయింబర్స్మెంట్ బిల్లులు ఒకేసారి క్లియర్ చేసింది. దీంతో 26,519 మంది ఉద్యోగ, పెన్షనర్లకు ఊరట దక్కింది. గత ప్రభుత్వంలోని పెండింగ్ బిల్లులను సైతం క్లియర్ చేసినట్లుగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క విడుదల చేయడం విశేషం. ఒకవైపు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు, మరోవైపు లెక్కకు మించిన సంక్షేమ పథకాలు ఉన్నప్పటికీ ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల మెడికల్ రీయంబర్స్మెంట్ బిల్లులకు ప్రాధాన్యత ఇస్తూ డిప్యూటీ సీఎం భట్టి వాటి చెల్లింపులకు నిధులు విడుదల చేశారు.

గత ప్రభుత్వం కాలంలో 2023మార్చి 1 నుంచి 2025జూన్ 25 వరకు పెండింగ్ లో ఉన్న బిల్లులను క్లియర్ కావడంతో ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Exit mobile version