Rahul Gandhi| యుద్దానికి మనం సిద్దం కావాలి : రాహుల్ గాంధీ

ప్రధాని మోదీ దుర్మార్గాలన్ని క్రమంగా బయటపడుతున్నాయని, ఇండో అమెరికన్ ట్రేడ్ డీల్ దేశానికి ప్రమాదకరం అని...భారత్ లోనూ యుద్దం వచ్చే పరిస్థితులు ఉన్నాయని కాంగ్రెస్ లోక్ సభ పక్షనేత రాహుల్ గాంధీ అన్నారు.

 

విధాత : ప్రధాని మోదీ దుర్మార్గాలన్ని క్రమంగా బయటపడుతున్నాయని, ఇండో అమెరికన్ ట్రేడ్ డీల్ దేశానికి ప్రమాదకరం అని…భారత్ లోనూ యుద్దం వచ్చే పరిస్థితులు ఉన్నాయని కాంగ్రెస్ లోక్ సభ పక్షనేత రాహుల్ గాంధీ అన్నారు. ఇరాన్ లాంటి పరిస్థితి మన దేశానికి రావద్దని , అందుకే మోదీ తప్పులను కాంగ్రెస్ శ్రేణులు ప్రజల్లోకి తీసుకెళ్లాలని, యుద్దానికి అంతా సిద్దం కావాలని వ్యాఖ్యానించారు.

వికారాబాద్ అనంతగిరి హిల్స్ సాప్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ లో ఏపీ, తెలంగాణ పీసీసీ రాజకీయ వ్యవహారాల కమిటీల ఉమ్మడి సమావేశంలో రాహుల్ గాంధీ,సీఎం రేవంత్ రెడ్డి ,కేసీ వేణుగోపాల్ పాల్గొన్నారు. అనంతరం వారు అనంతగిరి హరితా రిసార్ట్స్ లో జరుగుతున్న రెండు రాష్ట్రాల డీసీసీ అధ్యక్షుల శిక్షణా తరగతుల ముగింపు సమావేశానికి హాజరయ్యారు.

ఈ సందర్బంగా రాహుల్ గాంధీ మాట్లాడుతూ ఇండో అమెరికన్ ట్రేడ్ డీల్, ఇరాన్ యుద్ద పరిస్థితులపై కీలక వ్యాఖ్యలు చేశారు. డీసీసీ అధ్యక్షులు, నేతలకు దిశానిర్దేశం చేస్తూ రాహుల్ గాంధీ ప్రసంగించారు.

Latest News