Telangana | రాష్ట్రంలో మొదలైన రాజకీయ కాక

Telangana | విధాత‌: ఏపీ, తెలంగాణ సమా 9 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం సన్నద్ధమౌతున్నది. తెలంగాణ అసెంబ్లీ గడువు వచ్చే ఏడాది జనవరి 16తో ముగియనున్నది. దీంతో తెలంగాణ (Telangana)లో డిసెంబర్‌లో ఎన్నికల జరగనున్నాయి. అక్టోబర్‌లో ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉన్నది. ఎన్నికలకు ఐదు నెలల కాలం మాత్రమే ఉండటంతో ప్రధాన పార్టీలైన బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌, బీజేపీలు ఎన్నికలపై దృష్టి సారించాయి. వరుసగా మూడోసారి అధికారంలోకి వస్తామని 95 నుంచి 105 […]

  • Publish Date - May 20, 2023 / 04:18 AM IST

Telangana |

విధాత‌: ఏపీ, తెలంగాణ సమా 9 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం సన్నద్ధమౌతున్నది. తెలంగాణ అసెంబ్లీ గడువు వచ్చే ఏడాది జనవరి 16తో ముగియనున్నది. దీంతో తెలంగాణ (Telangana)లో డిసెంబర్‌లో ఎన్నికల జరగనున్నాయి. అక్టోబర్‌లో ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉన్నది. ఎన్నికలకు ఐదు నెలల కాలం మాత్రమే ఉండటంతో ప్రధాన పార్టీలైన బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌, బీజేపీలు ఎన్నికలపై దృష్టి సారించాయి. వరుసగా మూడోసారి అధికారంలోకి వస్తామని 95 నుంచి 105 సీట్లు సాధిస్తామని సీఎం కేసీఆర్‌ పార్టీ నేతలకు, శ్రేణులకు భరోసా ఇస్తున్నారు.

సంక్షేమ పథకాలు, ప్రాజెక్టుల నిర్మాణం, నూతల కలెక్టరేట్ల, సచివాలయ నిర్మాణం, రైతుబంధు, రైతు బీమా వంటివే కాకుండా మొన్న మంత్రివర్గ సమావేశంలోనూ ప్రభుత్వం కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నది. రాష్ట్రంలో కుల వృత్తులనే నమ్ముకొని జీవిస్తున్న విశ్వబ్రాహ్మణ, నాయీ బ్రాహ్మణ, రజక, కుమ్మరి, మేదరి వంటి కులాలవారిని ఆదుకొనేందుకు తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకొన్నది. కులవృత్తులు చేస్తున్నవారికి రూ.లక్ష వరకు ఆర్థిక సాయం అందించాలని నిర్ణయించింది.

ఇందుకోసం విధివిధానాల రూపకల్పనకు బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ నేతృత్వంలో క్యాబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేసింది. విధివిధానాలు ఖరారై, లబ్ధిదారుల ఎంపిక వేగంగా జరిగితే వచ్చే నెల 2వ తేదీ నుంచి నిర్వహించే తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల్లోనే ఆయా వర్గాలకు ఆర్థిక సహాయం అందించాలని ప్రభుత్వం భావిస్తున్నది. బీఆర్‌ఎస్‌కు పట్టం కడుతాయని కేసీఆర్‌ భావిస్తున్నారు.

అయితే నిరుద్యోగ సమస్యలు, ధరణితో రైతులు పడుతున్న ఇబ్బందులు, ప్రభుత్వ వ్యతిరేకత, కొన్ని నియోజకవర్గాల్లో ఇద్దరు ముగ్గురు నేతల మధ్య పోటీ, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మంత్రులు, ఎంపీల మధ్య విభేదాల వంటి అంశాలు అధికారపార్టీని కలవరపరుస్తున్నాయి. అందుకే కేసీఆర్‌ మొన్న బీఆర్‌ఎస్‌ విస్తృతస్థాయి సమావేశంలో మంత్రులు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలను కలుపుకుని వెళ్లాలని, ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో ఎమ్మెల్సీలు వేలు పెట్టవద్దని సూచించారు.