New Parliament | పార్ల‌మెంట్ ప్రారంభానికి మేము వెళ్తాం.. BSP, JD(S), TDP

New Parliament | పార్ల‌మెంట్ ప్రారంభానికి మేము వెళ్తాం BSP. JD(S), TDP వెల్ల‌డి BRS వ్యూహాత్మ‌క మౌనం  విధాత‌: పార్ల‌మెంట్ భ‌వ‌న ప్రారంభోత్స‌వాన్ని (New Parliament inauguration) బైకాట్ చేయాల‌ని 20 విప‌క్ష పార్టీలు గురువారం ఇచ్చిన పిలుపును మూడు ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష పార్టీలు పెడ‌చెవిన పెట్టాయి. బీజేపీయేత‌ర మూడు పార్టీలు తాము ప్రారంభోత్స‌వ వేడుక‌ల‌కు వెళ్తామ‌ని ప్ర‌క‌టించాయి. బీఎస్‌పీ. జేడీ(ఎస్‌), టీడీపీ ఈ మేర‌కు త‌మ అభిప్రాయాల‌ను సోష‌ల్ మీడియా వేదిక‌గా పంచుకున్నాయి. పార్ల‌మెంట్ […]

  • Publish Date - May 26, 2023 / 08:56 AM IST

New Parliament |

  • పార్ల‌మెంట్ ప్రారంభానికి మేము వెళ్తాం
  • BSP. JD(S), TDP వెల్ల‌డి
  • BRS వ్యూహాత్మ‌క మౌనం

విధాత‌: పార్ల‌మెంట్ భ‌వ‌న ప్రారంభోత్స‌వాన్ని (New Parliament inauguration) బైకాట్ చేయాల‌ని 20 విప‌క్ష పార్టీలు గురువారం ఇచ్చిన పిలుపును మూడు ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష పార్టీలు పెడ‌చెవిన పెట్టాయి. బీజేపీయేత‌ర మూడు పార్టీలు తాము ప్రారంభోత్స‌వ వేడుక‌ల‌కు వెళ్తామ‌ని ప్ర‌క‌టించాయి. బీఎస్‌పీ. జేడీ(ఎస్‌), టీడీపీ ఈ మేర‌కు త‌మ అభిప్రాయాల‌ను సోష‌ల్ మీడియా వేదిక‌గా పంచుకున్నాయి.

పార్ల‌మెంట్ అనేది బీజేపీ, ఆర్ ఎస్ ఎస్ కార్యాలయం కాద‌ని, ప్ర‌జ‌ల ప‌న్నుల‌తో నిర్మించిన‌ద‌ని మాజీ ప్ర‌ధాని హెచ్‌డీ దేవగౌడ పేర్కొన్నారు. కాంగ్రెస్‌, టీఎంసీ, డీఎంకే, ఆప్‌, ఆర్జేడీ, జేడీ(యూ), ఎన్సీపీ, ఎస్పీ పార్టీలు పార్ల‌మెంట్ భ‌వ‌న ప్రారంభోత్స‌వాన్నిబైకాట్ చేసిన సంగ‌తి తెలిసిందే.

Deve Gowd

నేను వెళ్తా: దేవ గౌడ

పార్ల‌మెంట్ భ‌వ‌న ప్రారంభోత్స‌వ కార్య‌క్ర‌మానికి తాను మాజీ ప్ర‌ధాని, భార‌త పౌరుడి హోదాలో వెళ్తాన‌ని జేడీ (ఎస్‌) నేత‌, మాజీ ప్ర‌ధాని దేవ‌గౌడ తెలిపారు. పార్ల‌మెంట్ భ‌వ‌నాన్ని ప్ర‌జ‌ల ప‌న్నుల‌తో నిర్మించార‌ని, ఇది దేశ ప్ర‌జ‌ల‌కు సంబంధించిన‌ద‌ని పేర్కొన్నారు. చాలా మంది ప్ర‌జ‌లు పార్ల‌మెంట్ భ‌వ‌నం ప్రారంభోత్స‌వానికి మీరు వెళ్తున్నారా? లేదా? అని అడుగుతున్నారు. భారత రాజ్యాంగం ప్ర‌కారం న‌డుకునే వ్య‌క్తిగా నేను కార్య‌క్ర‌మానికి వెళ్తాను* అని చెప్పారు.

షెడ్యూల్ కార‌ణంగా నేను వెళ్ల‌లేను: మాయావ‌తి

ప్ర‌జ‌ల సంక్షేమ‌, దేశ భ‌విష్య‌త్తును దృష్టిలో పెట్టుకొని రాజ‌కీయంగా కేంద్ర ప్ర‌భుత్వానికి మ‌ద్ద‌తిస్తామ‌ని బీఎస్పీ అధినేత్రి మాయావ‌తి తెలిపారు. ‘నాకు కూడా పార్ల‌మెంట్ భ‌వ‌న ప్రారంభోత్స‌వ కార్య‌క్ర‌మానికి ఆహ్వానం అందింది. కానీ, ముంద‌స్తు షెడ్యూల్, పార్టీ స‌మావేశాల‌ కార‌ణంగా వేడుక‌కు హాజ‌రు కావ‌డం లేదు’ అని ఆమె ట్విట్ట‌ర్‌లో తెలిపారు.

Mayawati

ప్ర‌తినిధిని పంపిస్తాం: టీడీపీ

పార్ల‌మెంట్ భ‌వ‌నం ప్రారంభోత్స కార్య‌క్ర‌మానికి హాజ‌రవుతామ‌ని టీడీపీ అధినేత నారా చంద్ర‌బాబు నాయుడు ప్ర‌క‌టించారు. పార్టీ ప్ర‌తినిధిగా రాజ్య‌స‌భ స‌భ్యుడు క‌న‌క‌మేడ‌ల ర‌వీంద్ర‌కుమార్ హాజ‌ర‌వుతార‌ని తెలిపారు. ఇప్ప‌టికే వైస్సార్ సీపీ అధినేత‌, ఏపీ సీఎం జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డి ఈ కార్య‌క్ర‌మానికి హాజ‌ర‌వుతామ‌ని ప్ర‌క‌టించారు. ప్ర‌తిప‌క్షాలు అన్నీ కూడా కార్య‌క్ర‌మానికి హాజ‌రుకావాల‌ని పిలుపునిచ్చారు.

ఎటువైపు ఉండాలో డిసైడ్ కానీ బీఆర్ఎస్ పార్ల‌మెంట్ భ‌వ‌నం ప్రారంభోత్స‌వానికి హాజ‌రుకావ‌డంపై బీఆర్ ఎస్ పార్టీలో ఇంకా నిర్ణ‌యం తీసుకోన‌ట్టు తెలుస్తున్న‌ది. కానీ, అంత‌ర్గతంగా పార్టీ శ్రేణులు మాత్రం కార్య‌క్ర‌మానికి దూరంగా ఉంటామ‌ని వెల్ల‌డించాయి.

కేంద్ర ప్ర‌భుత్వంపై అన్ని అంశాల‌పై నిల‌దీసే తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్‌.. పార్ల‌మెంట్ భ‌వ‌నం ప్రారంభోత్సవ అంశంలో ఇంత వ‌ర‌కు నోరు మెద‌ప‌క‌పోవ‌డం వ్యూహాత్మ‌క మౌనంగా రాజ‌కీయ ప‌రిశీల‌కులు భావిస్తున్నారు.

Latest News