Site icon vidhaatha

మేం ఇప్పుడు ఏం మాట్లాడినా వక్రీకరిస్తారు: కేటీఆర్‌

విధాత‌: ఎమ్మెల్యేలకు ఎర కేసుపై మీడియా కేటీఆర్‌ను ప్రశ్నించింది. దీనిపై ఆయన స్పందిస్తూ.. మేం ఏం మాట్లాడినా వక్రీకరిస్తారు. పరిశోధన చేస్తున్న సంస్థలు సమాచారం ఇస్తాయి. చట్టం కచ్చితంగా తన పని తాను చేస్తుంది. సందర్భానుసారంగా సీఎం, దర్యాప్తు సంస్థలు వివరాలు వెల్లడిస్తాయి. దర్యాప్తు సంస్థలను ప్రభావితం చేసేలా మాట్లాడమని తెలిపారు. తొందర పడవద్దని మా పార్టీ నాయకత్వానికి చెప్పాను.

అయితే.. సమయానుసారం సీఎం అన్ని విషయాలు మాట్లాడుతారు. ప్రమాణాలతో సమస్యలు పరిష్కార మైతే (బండి సంజయ్‌ని ఉద్దేశించి) ఇక పోలీసులు ఎందుకు? అని ప్రశ్నించారు. దొంగ ఎవరో దొర ఎవరో ప్రజలకు అర్థమైందని మంత్రి కేటీఆర్‌ అన్నారు. అమిత్ షా చెప్పులు మోసిన చేతులతో యాదాద్రి లక్ష్మి నరసింహ స్వామిని తాకారు.. ఇది పాపం, దేవుడు అపవిత్రం అవుతారు, సంప్రోక్షణ చేయాలన్నారు.

బీజేపీపై టీఆర్ఎస్ ఛార్జిషీట్‌ విడుదల

1. నీతి ఆయోగ్ చెప్పినా ఫ్లోరైడ్ నివారణకు నిధులు ఇవ్వలేదు, 2016లో నడ్డా చెప్పిన ఫ్లోరోసిస్ రీసెర్చ్ సెంటర్ ఇవ్వలేదు.
2. చేనేతపై జీఎస్టీ వేసిన తొలి ప్రధాని మోడీ, నూలు సబ్సిడీ తగ్గింపు, ఖాదీ బోర్డ్ రద్దు చేశారు.
3. వ్యవసాయ మీటర్లకు మీటర్లు.
4. నీటి పంపకాల్లో తెలంగాణకు అన్యాయం, 5. గ్యాస్ ధర పెంపు, నిత్యావసర వస్తువుల ధరల పెంపు.

Exit mobile version