Site icon vidhaatha

Tirumala | ఆగస్టు 1 నుంచి శ్రీవారి పుష్క‌రిణి మూత

Tirumala |

భక్తులకు షవర్ల ద్వారా పుణ్యస్నానాల ఏర్పాటు

విధాత: తిరుమ‌లలో శ్రీ‌వారి ఆల‌యం వద్ద గల పుష్క‌రిణిలో నీటిని పూర్తిగా తొలగించి పైపులైన్ల మరమ్మతులు, సివిల్ పనులు చేపట్టేందుకు గాను ఆగస్టు 1 నుంచి 31వ తేదీ వరకు పుష్క‌రిణిని మూసి వేస్తారు. ఈ కారణంగా నెల రోజుల పాటు పుష్క‌రిణి హార‌తి ఉండ‌దు.

పుష్క‌రిణి మ‌ర‌మ్మ‌తుల కోసం మొద‌టి ప‌ది రోజుల పాటు నీటిని తొల‌గిస్తారు. ఆ త‌రువాత ప‌ది రోజులు మ‌ర‌మ్మ‌తులు ఏవైనా ఉంటే పూర్తి చేస్తారు. చివ‌రి ప‌ది రోజులు పుష్క‌రిణిలో నీటిని నింపి పూర్తిగా సిద్ధం చేస్తారు. పుష్క‌రిణిలోని నీటి పిహెచ్ విలువ 7 ఉండేలా చూస్తారు.

టీటీడీ వాట‌ర్ వ‌ర్క్స్ విభాగం ఆధ్వర్యంలో ఈ పనులు చేపడుతారు. పనులు పూర్తయ్యేదాకా శ్రీవారి భక్తులు పుణ్యస్నానాలు చేసేందుకు వీలుగా పుష్కరిణి పైభాగంలో టీటీడీ షవర్లు ఏర్పాటు చేసింది. భక్తులు వీటిని వినియోగించుకోవాలని కోరుతోంది.

Exit mobile version