Site icon vidhaatha

ఈసీ కార్యాలయం ముందు టీజేఎస్ మౌన దీక్ష

విధాత: మునుగోడు ఉప ఎన్నికల్లో జరుగుతున్న అక్రమాలపై, ప్రభుత్వఅధికార దుర్వినియోగం పై, మద్యం, డబ్బు పంపిణీలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ టీజేఎస్ మంగళవారం రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యాలయం ముందు మన దీక్ష నిర్వహించింది.

ఈ సందర్భంగా టీజేఎస్ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరామ్ మాట్లాడుతూ మునుగోడు ఉప ఎన్నికల్లో ఎన్నికల సంఘం నిబంధనలు అమలు కావడం లేదని, ప్రధాన పార్టీలు విచ్చలవిడిగా డబ్బు మద్యం పంపిణీ చేస్తున్న చర్యలు కరువయ్యాయని, వెంటనే వాటి నివారణకు ఎన్నికల సంఘం నిబంధనల మేరకు చర్యలు తీసుకోవాలని కోరారు. అధికారులకు వినతి పత్రం అందించారు

Exit mobile version