Trains Cancelled | తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మధ్య నడిచే పలు రైళ్లను దక్షిణ మధ్య రైల్వే రద్దు చేసింది. అదే సమయంలో పలు రైళ్లను రీ షెడ్యూల్ చేసినట్లు ప్రకటించింది. మెయింటెన్స్ పనుల నేపథ్యంలో హైదరాబాద్, సికింద్రాబాద్ డివిజన్లలో పలు రైళ్లను రద్దు చేసినట్లు వివరించింది.
ఈ నెల 25న కర్నూల్ సిటీ-సికింద్రాబాద్ (రైలు నంబర్ 17024) రైలు 90 నిమిషాలు రీ షెడ్యూల్ చేసినట్లు పేర్కొంది. అలాగే గుంతకల్లు-బోధన్ (07671) రైలును ఈ నెల 26, 27, 30 తేదీల్లో 120 నిమిషాలు రీషెడ్యూల్ చేసినట్లు తెలిపింది.
ఈ నెల 30వ తేదీ వరకు దండి-నిజామాబాద్ (11409) రైలు ముద్ఖేడ్-నిజామాబాద్, 25 నుంచి 31వ తేదీ వరకు నిజామాబాద్-పందర్‌పూర్ (01413) రైలు నిజామాబాద్-ముద్ఖేడ్ మధ్య రద్దు చేస్తున్నట్లు పేర్కొంది. కాచిగూడ-నిజామాబాద్ (07596), నిజామాబాద్-కాచిగూడ (07593), నాందేడ్-నిజామాబాద్ (07854) రైళ్లు ఈ నెల 30 వరకు, నిజామాబాద్-నాందేడ్ (07853) రైళ్లను (3215) నుంచి రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే వివరించింది.
కడగలపాలెం-శావల్యాపురం మధ్య ఇంటర్‌లింకింగ్ పనుల కారణం ఈ నెల 31 నుంచి ఈ నెల 3వ తేదీ వరకు పలు రైళ్లను పాక్షికంగా రద్దయ్యాయి. గుంటూరు-తిరుపతి (17261) రైలు మార్కాపురం-తిరుపతి మధ్య మాత్రమే దక్షిణ మధ్య రైల్వే వివరించింది.
Gold Rates | ఊరటనిస్తున్న పుత్తడి ధరలు.. నేడు మార్కెట్‌లో ధరలు ఎలా ఉన్నాయంటే..?