విధాత: మునుగోడులో నామినేషన్ల ప్రక్రియ రేపటి నుంచే ప్రారంభమౌతుంది. పార్టీ ఎన్నికల గుర్తు కారులో ఎలాంటి మార్పు ఉండదని టీఆర్ వర్గాలు తెలిపాయి. వ్యక్తి పేరు మార్చినట్లే పార్టీ పేరు మార్చామని, మిగతావన్నీయథాతథంగా ఉంటాయన్నది.
బీఆర్ఎస్‌ను సీఈసీ గుర్తించే వరకూ టీఆర్ఎస్ పేరే కొనసాగుతుందని పార్టీ వర్గాలు చెప్పాయి. మనుగోడు ఉప ఎన్నికలో టీఆర్ఎస్ పేరుతోనే పోటీ చేస్తున్నట్లు తెలిపాయి. టీఆర్ఎస్ పేరుతోనే మునుగోడు ఉప ఎన్నికకు వెళ్తున్నట్లు సీఈసీని కలిశాక పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. బీఆర్ఎస్ గుర్తింపునకు కొంత సమయం పడుతుందని వెల్లడించాయి.