Site icon vidhaatha

రేవంత్ సమక్షంలో కాంగ్రెస్‌లో చేరిన సరూర్‌నగర్‌ టీఆర్‌ఎస్ నేతలు

విధాత‌: టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి చేరే వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. తాజాగా మరికొంత మంది టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సమక్షంలో కారు దిగి హస్తం గూటికి చేరారు.

హైదరాబాద్ సరూర్ నగర్‌కు చెందిన పలువురు టీఆర్ఎస్ కార్యకర్తలు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు.

అనంతరం గాంధీభవన్‌లో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అధ్యక్షతన మునుగోడు ఉపఎన్నికల సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఏఐసీసీ ఇంచార్జ్ మాణికం ఠాగూర్‌, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఏఐసీసీ కార్యదర్శులు పాల్గొన్నారు.

Exit mobile version