Site icon vidhaatha

TSRTC | గానుగాపూర్‌ దత్తదర్శనానికి టీఎస్‌ ఆర్టీసీ ప్రత్యేక ప్యాకేజీ..! పండరీపూర్‌, తుల్జాపూర్‌ దర్శనం కూడా..!

TSRTC | తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ కర్ణాటకలోని ప్రముఖ క్షేత్రమైన దత్తాత్రేయ స్వామి ఆలయానికి ప్రత్యేక సర్వీసు నడుపనున్నది. ఈ నెల 17న అమావాస్య స్పందన ప్రత్యేకంగా సూపర్‌ లగ్జరీ సర్వీసులను ఏర్పాటు చేస్తున్నది.

గానుగాపూర్‌తో పాటు మహారాష్ట్రలోని పండరీపూర్‌, తుల్జాపూర్‌ ఆలయాల దర్శనం సైతం కల్పించ నున్నారు. ప్రత్యేక బస్సు ఈ నెల 16న సాయంత్రం హైదరాబాద్‌ నుంచి గానుగాపూర్‌ ఆలయానికి ఎంజీబీఎస్‌ నుంచి బయలుదేరుతుంది. 17న దత్తాత్రేయ స్వామి దర్శనం ఉంటుంది. అదే రోజు మధ్యాహ్నం 12 గంటలకు బయలుదేరి సాయంత్రం 4 గంటల వరకు పండరీపూర్‌ చేరుకుంటుంది.

అక్కడ పాండురంగస్వామి దర్శనాలు పూర్తయ్యాక రాత్రి 10 గంటలకు తుల్జాపూర్‌ ఆలయానికి బయలుదేరుతుంది. 18న తుల్జాపూర్‌ భవానీ అమ్మవారి దర్శనం ఉదయం ఉంటుంది. దర్శనాలు పూర్తయ్యాక మధ్యాహ్నం వరకు 2 గంటలకు బస్‌ హైదరాబాద్‌ బయలుదేరుతుంది. అదే రోజు రోజు రాత్రి 8.30 గంటలకు ఎంజీబీస్‌కు చేరుకుంటుంది. దాంతో పర్యటన ముగుస్తుది.

గానుగాపూర్‌ ప్రత్యేక ప్యాకేజీ ధరను రూ.2500 నిర్ణయించింది. ఈ ప్యాకేజీలోలో కేవలం ప్రయాణ ఖర్చులు మాత్రమే. దర్శనాలు, భోజనం, వసతి కోసం భక్తులే భరించాల్సి ఉంటుంది.

ప్యాకేజీలో దర్శనానికి వెళ్లాలనుకే వారు tsrtconline.inలో చేసుకోవచ్చని, లేదంటే ఎంజీబీఎస్‌, జేబీఎస్‌, దిల్‌సుఖ్‌నగర్‌ బస్‌స్టేషన్‌లోని కౌంటర్లలో రిజర్వేషన్‌ చేసుకోవచ్చని తెలిపింది. వివరాలకు 9440566379, 9959226257,9959224911 ఆర్టీసీ కోరింది.

Exit mobile version