Site icon vidhaatha

TSRTC సంక్రాంతి ఆదాయం రూ.165.46 కోట్లు

విధాత‌: తెలంగాణ ఆర్టీసీ ప్ర‌గ‌తి చ‌క్రాలు అభివృద్ధి వైపు ప‌రుగులు పెడుతున్నాయి. ర‌క‌ర‌కాల ఆఫ‌ర్ల‌తో ఎప్ప‌టిక‌ప్పుడు ఆదాయాన్ని పెంచుకునేందుకు టీఎస్ ఆర్టీసీ కృషి చేస్తున్న సంగ‌తి తెలిసిందే.

సంక్రాంతి పండుగ వేళ కూడా ప్ర‌యాణికుల‌కు ఆర్టీసీ బ‌స్సుల్లో ప్ర‌యాణిస్తే ఛార్జీలో 10 శాతం(తిరుగు ప్ర‌యాణంలో) డిస్కౌంట్ క‌ల్పిస్తామ‌ని ఆర్టీసీ ప్ర‌క‌ట‌న‌లు ఇచ్చింది. మొత్తంగా ఆర్టీసీ ఆఫ‌ర్ల‌కు సంక్రాంతి పండుగ వేళ టీఎస్ ఆర్టీసీకి భారీగా ఆదాయం స‌మ‌కూరింది.

సంక్రాంతి సీజ‌న్‌లో టీఎస్ ఆర్టీసీకి రూ. 165.46 కోట్ల ఆదాయం వ‌చ్చిన‌ట్లు ఎండీ స‌జ్జ‌నార్ తెలిపారు. గ‌త ఏడాది క‌న్నా రూ. 62.29 కోట్ల ఆదాయం అద‌నంగా వ‌చ్చిన‌ట్లు పేర్కొన్నారు. 11 రోజుల్లో 2.82 కోట్ల మంది ప్ర‌యాణికులు ప్ర‌యాణించిన‌ట్లు ఆర్టీసీ ఎండీ స‌జ్జ‌నార్ ప్ర‌క‌టించారు.

Exit mobile version