Nalgonda | ఆ ఇద్దరు డిగ్రీ విద్యార్ధినిలు ఆత్మహత్య.. ఒకరిని విడిచి ఉండలేకేనా?

Nalgonda | విధాత, ఉమ్మడి నల్లగొండ బ్యూరో: నల్లగొండ జిల్లా కేంద్రం రాంనగర్ రాజీవ్ పార్కులో ఆత్మహత్యా యత్నానికి పాల్పడిన ఇద్దరు డిగ్రీ విద్యార్ధినిలు నల్గొండ ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. నార్కట్‌పల్లి మండం అమ్మనబోలుకు చెందిన ఎనుగుదుల మనీషా, నక్కలపలిలకి చెందిన దంతబోయిన శివానిలు నల్లగొండ మహిళా డిగ్రీ కళాశాలలో డీగ్రీ రెండో సంవత్సరం చదువుతున్నారు. మంగళవారం సాయంత్రం రాంనగర్ పార్కుకు వెళ్లిన వారిద్ధరు గడ్డి మందు సేవించి ఆత్మహత్యాయత్నం చేసుకోగా, స్థానికులు గమనించి […]

  • Publish Date - September 6, 2023 / 04:37 AM IST

Nalgonda |

విధాత, ఉమ్మడి నల్లగొండ బ్యూరో: నల్లగొండ జిల్లా కేంద్రం రాంనగర్ రాజీవ్ పార్కులో ఆత్మహత్యా యత్నానికి పాల్పడిన ఇద్దరు డిగ్రీ విద్యార్ధినిలు నల్గొండ ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. నార్కట్‌పల్లి మండం అమ్మనబోలుకు చెందిన ఎనుగుదుల మనీషా, నక్కలపలిలకి చెందిన దంతబోయిన శివానిలు నల్లగొండ మహిళా డిగ్రీ కళాశాలలో డీగ్రీ రెండో సంవత్సరం చదువుతున్నారు.

మంగళవారం సాయంత్రం రాంనగర్ పార్కుకు వెళ్లిన వారిద్ధరు గడ్డి మందు సేవించి ఆత్మహత్యాయత్నం చేసుకోగా, స్థానికులు గమనించి వారిని నల్లగొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ బుదవారం మృతి చెందారు.

తల్లిదండ్రుల కథనం మేరకు వారిని కొన్ని రోజులుగా కొందరు ఆకతాయిలు ర్యాగింగ్ చేస్తున్నారని, వారి ఫోటోలను సోషల్ మీడియాలో అశ్లీలంగా ప్రచారం చేస్తున్నారని దీంతో వారు ఆత్మహత్యకు పాల్పడ్డారని తమతో చెప్పినట్లు తెలిపారు. అయితే నిజానిజాలను నిర్ధారించేందుకు పోలీసులు విద్యార్థినిల సెల్ ఫోన్స్ కాల్ డేటా ఆధారంగా దర్యాప్తు చేపట్టారు.

గత 20 రోజులుగా ఇంటి వద్దనే ఉన్న వీరిద్దరు కళాశాలకు వెళ్తామని కుటుంబ సభ్యులకు చెప్పి మంగళ వారం ఉదయం బస్సులో నల్లగొండకు వచ్చి ఎన్జీ కళాశాల వెనుక ఉన్న రాజీవ్ పార్కులోకి వెళ్లి గడ్డి మందు తాగి పార్కు గేట్ వద్దకు వచ్చి బిగ్గరగా ఏడవడం మొదలుపెట్టారు. గమనించిన స్థానికులు ఆసుపత్రికి తరలించారు.

దర్యాప్తులో భాగంగా పోలీసులు వారి కాల్ డేటాను పరిశీలించగా ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. ఆ ఇద్దరు విద్యార్థినుల మధ్యే ఎక్కువగా ఫోన్ సంభాషణ ఉన్నట్లు తెలిసింది. వారి బ్యాగులో నిద్రమాత్రలు లభించాయి. విద్యార్థినులిద్దరూ ఒకరిని విడిచి ఒకరు ఉండలేమని ఆత్మహత్యకు పాల్పడి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.

Latest News