WARANGAL: గుర్తుతెలియని డెడ్‌బాడీ KMCకి అప్పగింత

వరంగల్, విధాత: సాధారణంగా గుర్తుతెలియని మృతదేహం లభ్యమైతే స్థానిక పోలీసులు పంచనామా చేసి సమీపంలోని మార్చూరీలో భద్రపరుస్తుంటారు. సంబదీకులెవరైనా వస్తే అప్పగించడం ఆనవాయితీ. కొద్ది రోజుల వరకు వేచి చూసిన తర్వాత ఎవరూ రాకుంటే ఆనవాళ్లు భద్ర పరిచి డెడ్‌బాడీ పూడ్చి పెడుతుంటారు. అయితే గుర్తు తెలియని మృతదేహాలను పూడ్చిపెట్టడం కంటే మెడికల్ విద్యార్థులకు ఉపయోగ పడే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన జీవో మేరకు కాకతీయ మెడికల్ కాలేజీకి మంగళవారం కాజీపేట పోలీసులు అందచేశారు. ఇది […]

  • Publish Date - December 6, 2022 / 05:54 PM IST

వరంగల్, విధాత: సాధారణంగా గుర్తుతెలియని మృతదేహం లభ్యమైతే స్థానిక పోలీసులు పంచనామా చేసి సమీపంలోని మార్చూరీలో భద్రపరుస్తుంటారు. సంబదీకులెవరైనా వస్తే అప్పగించడం ఆనవాయితీ. కొద్ది రోజుల వరకు వేచి చూసిన తర్వాత ఎవరూ రాకుంటే ఆనవాళ్లు భద్ర పరిచి డెడ్‌బాడీ పూడ్చి పెడుతుంటారు.

అయితే గుర్తు తెలియని మృతదేహాలను పూడ్చిపెట్టడం కంటే మెడికల్ విద్యార్థులకు ఉపయోగ పడే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన జీవో మేరకు కాకతీయ మెడికల్ కాలేజీకి మంగళవారం కాజీపేట పోలీసులు అందచేశారు. ఇది తొలి సంఘటనగా పోలీసులు చెప్పారు. దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.

నవంబర్ 26 తేదీన గుర్తు తెలియని మగ వ్యక్తి వయస్సు ‘సుమారు 50 సంవత్సరాల నుంచి 60 సంవత్స రాల మధ్య గల వ్యక్తి కాజీపేట బాపూజీ నగర్‌లోని తాజుద్దీన్ సైకిల్ షాప్ ఎదురుగా ఉన్న టైలర్ షాప్ పక్కన ఇసుకలో అపస్మారక స్థితిలో ఉండగా 108లో వరంగల్ ఎంజీఎంకు తరలించారు. అక్కడ ఆ వ్యక్తి చికిత్స పొందుతూ చనిపోయినట్లు కాజీపేట వీఆర్‌ఏ నర్సయ్య ఈ నెల ఒకటో తేదీన ఫిర్యాదు చేశారు. దీనిపై కాజీపేట పోలీసులు కేసు నమోదు చేశారు.

ఈ గుర్తు తెలియని వ్యక్తి మృతదేహాన్ని మంగళవారం వరకు వరంగల్ ఎంజీఎం మార్చురిలో భద్రపరిచారు. ఈ రోజు వరకు అట్టి గుర్తుతెలియని మగ వ్యక్తి శవం గురించి రక్త బంధువులు ఎవరు రాకపోవడంతో అట్టి శవానికి పంచనామ చేసిన అనంతరం తెలంగాణ ప్రభుత్వ జీవో ప్రకారం వరంగల్ KMC కోసం ఎంజీఎం హాస్పిటల్ సూపరింటెండెంట్‌ డాక్టర్ వి.చంద్రశేఖర్ కు అప్పగించారు.

ఈ కార్యక్రమంలో కాజీపేట ఏసిపి శ్రీనివాస్, సీఐ గట్ల మహేందర్ రెడ్డి, ఎస్సై సిహెచ్ ప్రమోద్ కుమార్‌లు వచ్చి భవిష్యత్తులో కూడా మెడికల్ కాలేజీకి సహకరించాలని కోరుతూ అభినందించారు.