Site icon vidhaatha

దబిడి దిబిడే: ‘అన్‌స్టాపబుల్ విత్ NBK 2’.. పైరసీ చేస్తే జైలుకే!

విధాత: ‘ఆహా’ ఓటీటీలో అన్‌స్టాపబుల్‌గా ప్రసారమవుతోన్న ‘అన్‌స్టాపబుల్ విత్ ఎన్‌బికె’ టాక్ షో సీజన్ 2కి సిద్ధమైంది. అందులో భాగంగా ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఆయన తనయుడు నారా లోకేష్ మొదటి ఎపిసోడ్‌కి గెస్ట్‌లుగా హాజరయ్యారు.

ఈ షో శుక్రవారం మధ్యాహ్నం నుంచి ‘ఆహా’లో స్ట్రీమింగ్ అవుతోంది. ‘ఆహా’లో శుక్రవారం మధ్యాహ్నం 2 గంటల 13 నిమిషాలకు ఈ షోని లైవ్ చేశారు. ప్రస్తుతం ఈ షో టాప్‌లో ట్రెండ్ అవుతోంది. అయితే ఈ టాక్‌ షో‌ని ఎవరైనా కాపీ, పైరసీ చేసి ఇతర మాధ్యమాలలో ప్రసారం చేస్తే వారిపై తీవ్రమైన చర్చలు తీసుకోబోతున్నట్లుగా ‘ఆహా’ టీమ్ హెచ్చరించింది.

‘ఆహా’ వారి వినమ్ర పూర్వక విన్నపం

ఆహాలో ప్రతి ఒక్కరు, ప్రతి క్షణం ప్రజలందరికీ అత్యున్నతమైన వినోదాన్ని, అత్యుత్తమ సాంకేతిక విలువలతో అందించేందుకు అహర్నిశలు శ్రమిస్తారు. అందులో భాగంగా మీకు అందిస్తున్న ప్రోగ్రామ్ ‘అన్‌స్టాపబుల్ విత్ ఎన్‌బికె’. ఈ కార్యక్రమం ఎంతటి వినోదాన్ని పంచుతుందో, ఎలాంటి దిగ్గజాలను మీ ముందు ఆవిష్కరిస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

ఇది ఆహాలో పనిచేసే ప్రతి ఒక్కరి అలుపెరుగని కృషి, కష్టఫలం. దయచేసి ఈ అద్భుతమైన ప్రోగ్రామ్‌ని, ఆహా వినోదాలని 100 శాతం నాణ్యతతో ఆహా సబ్‌స్ర్కిప్షన్ ద్వారానే ఆస్వాదించండి. పైరసీని ప్రోత్సహించకండి. పైరసీ చట్టరీత్యా నేరం. శిక్షార్హం. మా అభ్యర్థనని మన్నిస్తారని ఆశిస్తూ.. మీ.. ఆహా’’ అంటూ ఓ లేఖను ఆహా టీమ్ విడుదల చేసింది.

ఇలా వినమ్రంగా చెబుతూనే.. ‘అన్‌స్టాపబుల్ విత్ ఎన్‌బీకే 2’ను ఎవరైనా పైరసీ చేసినట్లు గమనించి నట్లయితే వెంటనే పైర‌సీకి సంబంధించిన ఫొటోల‌ను, వీడియోల‌ను జ‌త చేస్తూ యాంటీ పైరసీ హెల్ప్ లైన్ నెంబర్ 93939 50505 లేదా apc50505@gmail.com ల‌కు వివ‌రాల‌ను తెలియజేయాలని కోరారు. అలాంటి వ్య‌క్తులు లేదా సంస్థ‌ల‌పై చ‌ట్ట ప‌ర‌మైన సివిల్‌, క్రిమిన‌ల్ చ‌ర్య‌ల‌ను తీసుకుంటామని ఆహా టీమ్ హెచ్చరించింది. దీనికి నంద‌మూరి హార్డ్ కోర్ ఫ్యాన్స్ సహకరించాలని కూడా టీమ్ కోరింది.

Exit mobile version