విధాత: ఈ వారం థియేటర్లలో ఆర డజన్‌కు పైగా సినిమాలు విడుదల కానున్నాయి. అందులో ముఖ్యంగా విడుదలకు ముందే వివాదాస్పదమైన షారుఖ్ నటించిన పాన్ ఇండియా చిత్రం పఠాన్ ప్రేక్షకుల ముందుకు వస్తుంది. దాదాపు ఐదు సంవత్సరాల తర్వాత షారుఖ్ సినిమా థియేటర్లలో విడుదల కానుండడంతో దేశ వ్యాప్తంగా అందరి చూపు ఈ సినిమా పైనే ఉన్నది. ఇక మిగతా వాటిలో మహేశ్‌బాబు బావ సుధీర్‌బాబు నటించిన హంట్, బాగ్‌మతి ఫేం ఉన్ని ముకుందన్ హీరోగా అల్లు అరవింద్ విడుదల చేస్తున్న మాలికాపురం మినహ మిగతావి అన్నీ చిన్న చిత్రాలే.
ఇక ఓటీటీల్లో నిఖిల్ నటించిన 18 పేజేస్, రెజీనా నటించిన జాన్‌బాజ్ వెబ్ సిరీస్ మినహ అంతగా ఆసక్తికరమైనవి ఏవి రావడం లేదు. మరి థియేటర్లు, ఓటీటీల్లో వచ్చే చిత్రాలేంటో.. అవి ఎక్కడెక్కడ వస్తున్నాయో చూసేయండి మరి.