UPI-ATM | యూపీఐ ఏటీఎం వచ్చేసింది..! ఇక డెబిట్‌కార్డు లేకుండానే విత్‌డ్రా..!

UPI-ATM | భారత్‌లో తొలి యూపీఐ ఏటీఎం అందుబాటులోకి వచ్చింది. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) భాగస్వామ్యంతో హిటాచీ పేమెంట్ సర్వీసెస్ సంస్థ వైట్ లేబుల్ ఏటీఎం ఈ యూపీఐ ఏటీఎం తీసుకువచ్చింది. ఏటీఎం ద్వారా డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ లేకుండానే క్యాష్ విత్ డ్రా చేసుకునే వీలుకలుగనున్నది. ఈ ఏటీఎం ద్వారా డబ్బును విత్‌ డ్రా చేసుకునేందుకు కేవలం స్మార్ట్‌ఫోన్‌తో పాటు అందులో యూపీఐ ఉంటే సరిపోతుంది. కేవలం క్యూఆర్‌కోడ్‌ను స్కాన్‌ […]

  • Publish Date - September 7, 2023 / 08:35 AM IST

UPI-ATM |

భారత్‌లో తొలి యూపీఐ ఏటీఎం అందుబాటులోకి వచ్చింది. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) భాగస్వామ్యంతో హిటాచీ పేమెంట్ సర్వీసెస్ సంస్థ వైట్ లేబుల్ ఏటీఎం ఈ యూపీఐ ఏటీఎం తీసుకువచ్చింది. ఏటీఎం ద్వారా డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ లేకుండానే క్యాష్ విత్ డ్రా చేసుకునే వీలుకలుగనున్నది.

ఈ ఏటీఎం ద్వారా డబ్బును విత్‌ డ్రా చేసుకునేందుకు కేవలం స్మార్ట్‌ఫోన్‌తో పాటు అందులో యూపీఐ ఉంటే సరిపోతుంది. కేవలం క్యూఆర్‌కోడ్‌ను స్కాన్‌ చేసుకుంటే ఏటీఎం ద్వారా నగదును విత్‌డ్రా చేసుకునే ఉంటే సరిపోతుంది.

యూపీఐ ఏటీఎం బ్యాంకింగ్‌ సేవల్లో ఓ విప్లవాత్మక ముందడుగని ఎన్‌పీసీఐ పేర్కొంది. కార్డు అవసరం లేకుండా మారుమూల ప్రాంతాల్లో కాష్‌ విత్‌డ్రాకు ఏటీఎం ఉపయోగపడుతుందని పేర్కొంది. యూపీఐ ఏటీఎంను ఇంటరాపరబుల్‌ కార్డ్‌లెస్‌ క్యాష్‌ విత్‌డ్రాగా పిలుస్తుంటారు.

ఎలా వాడాలంటే..

ఏటీఎంలలో కస్టమర్ యూపీఐ క్యాష్ విత్ డ్రాయల్ ఆప్షన్‌ను ఎంచుకోవాలి. విత్‌డ్రా చేయాలనుకుంటున్న మొత్తాన్ని ఎంటర్ చేయాలని ఏటీఎంలో సూచిస్తుంది. ఆ మొత్తాన్ని ఎంటర్‌ చేసిన తర్వాత ఏటీఎం స్క్రీన్‌పై ఓ క్యూఆర్‌ కోడ్‌ కనిపిస్తుంది.

ఆ మొత్తాన్ని ఎంటర్‌ చేసిన తర్వాత ఏటీఎం స్క్రీన్‌పై క్యూఆర్‌ కోడ్‌ కనిపిస్తున్నది. వినియోగదారులు తన స్మార్ట్‌ఫోన్ ఏదైనా యూపీఐ యాప్‌లో ఉన్న స్కానర్ ద్వారా క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేయాలి. యూపీఐ పిన్‌ను ఎంటర్‌ చేస్తే మిషన్‌ నుంచి నగదు వస్తుంది. దాంతో ట్రాన్సాక్షన్‌ పూర్తవుతుంది.

Latest News