Site icon vidhaatha

Kedarnath | హెలీకాప్టర్‌తో సెల్ఫీ.. బ్లేడ్‌ తగిలి అధికారి మృతి..! కేదార్‌నాథ్‌లో ఘటన..

Kedarnath |

ఉత్తరాఖండ్‌లోని ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రమైన కేదార్‌నాథ్‌లో విషాదకర ఘటన చోటు చేసుకున్నది. ఓ ప్రభుత్వ అధికారి హెలీకాప్టర్‌ వెలుపల సెల్ఫీ తీసుకునేందుకు ప్రయత్నిస్తుండగా బ్లేడ్‌ తగిలి ప్రాణాలు కోల్పోయారు. వివరాల్లోకి వెళితే.. ఉత్తరాఖండ్‌కు చెందిన గవర్నమెంట్‌ అధికారి జితేంద్రకుమార్‌ సైనీ కేదార్‌నాథ్‌లో విధుల్లో ఉన్నారు.

ఈ క్రమంలోనే హెలీకాప్టర్‌ కేదార్‌నాథ్‌ చేరుకోగా.. హెలీకాప్టర్‌ వెలుపల సెల్ఫీ తీసుకునేందుకు ప్రయత్నిస్తూ.. టెయిల్‌ రోటర్‌ బ్లేడ్‌ వరకు వచ్చారు. దాంతో బ్లేడ్‌ తగిలి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.

ఆయన సివిల్ ఏవియేషన్ డెవలప్‌మెంట్ అథారిటీకి ఫైనాన్షియల్ కంట్రోలర్‌ సేవలందిస్తున్నారు. ఇదిలా ఉండగా.. చార్‌ధామ్‌ యాత్ర సందర్భంగా ఉత్తరకాశీ జిల్లాలో గంగోత్రి, యమునోత్రి ఆలయాలను తెరిచారు.

యాత్ర కోసం దేశ విదేశాలకు చెందిన 16లక్షల మంది పర్యాటకులు పేర్లు నమోదు చేసుకున్నారు. ఈ నెల 25న కేదార్‌నాథ్‌ ఆలయం, 27న బద్రీనాథ్‌ ఆలయ ద్వారాలు తెరుచుకున్నాయి. మరో వైపు కేదార్‌నాథ్‌లో భారీగా మంచువర్షం కురుస్తున్నది.

Exit mobile version