Site icon vidhaatha

వన భోజనాలు.. బోనాలు: మునుగోడులో TRS ఆత్మీయ సమ్మేళనాలు

విధాత, యాదాద్రి భువనగిరి: మునుగోడు ఉప ఎన్నికల్లో గెలుపే ప్రధానంగా రాజకీయ పార్టీలు వినూత్న ఎత్తుగడలు వేస్తున్నారు. ఓటర్ల కంటే ముందు సొంత పార్టీ నాయకులూ, వారి కుటుంబ సభ్యులను ఆకట్టుకునేందుకు టీఆర్‌ఎస్ కుటుంబ ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహిస్తున్నారు.

టీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తల కుటుంబ సభ్యులను ఒక చోటకు చేర్చి వన భోజనాలు, ఆటలు, పాటలతో సందడి చేస్తున్నారు.

దీనిలో భాగంగా గురువారం యాదాద్రి భువనగిరి జిల్లా మునుగోడు నియోజకవర్గం పరిధిలోని నారాయణ పురం మండలంలో టీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. వనభోజన కార్యక్రమం ఏర్పాటు చేశారు. మహిళలు బోనం ఎత్తుకొన్నారు, బతుకమ్మలు ఆడారు. ప్రభుత్వ విప్ గొంగిడి సునీత మహేందర్ రెడ్డి వీరితో కలిసి పాల్గొని సందడి చేశారు.

Exit mobile version